షియోమీ 12 అల్ట్రా స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు ఇందులో మరింత శక్తివంతమైన పెరిస్కోప్ టెలిఫొటో సెన్సార్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి.


షియోమీ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ తరహాలోనే దీని కెమెరా సెటప్ ఉండనుంది. చైనాలో ఈ ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. డిజిటల్ చాట్ స్టేషన్ అనే ప్రముఖ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం.. ఇందులో 5x పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ అందించారు. ఈ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో 5x పెరిస్కోప్ లెన్స్ ఉన్న ఫోన్లు లేవు. వన్‌ప్లస్ 10 ప్రోలో అత్యధికంగా 3.3x ఆప్టికల్ జూమ్ అందుబాటులో ఉంది.


షియోమీ 12 సిరీస్‌లో కంపెనీ లెయికా కెమెరాలను అందించనుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ ముందువైపు, వెనకవైపు డిజైన్లు కూడా ఇందులో చూడవచ్చు. ఇందులో షేర్ చేసిన ఫొటోను బట్టి చూస్తే.. ఈ ఫోన్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. 


ఇందులో పంచ్ హోల్‌ను ఫోన్ మధ్యలో అందించనున్నారు. ఈ పంచ్ హోల్‌లోనే సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఫోన్‌కు ప్రొటెక్టివ్ ఉంది కాబట్టి బ్యాక్ ప్యానెల్ డిజైన్ కనిపించలేదు. అయితే గతంలో వచ్చిన కథనాలకు తగ్గట్లే ఈ బ్యాక్ ప్యానెల్ డిజైన్ ఉండనుందని ప్రొటెక్షన్ కేస్ చూసి తెలుసుకోవచ్చు.


ఇందులో 6.6 అంగుళాల 2కే అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుందని తెలుస్తోంది. అయితే షియోమీ 11 అల్ట్రా తరహాలో ఇందులో సెకండరీ డిస్‌ప్లేను కంపెనీ అందించలేదు. ఫిబ్రవరిలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!


Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!


Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!


Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!


Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి