2020లోనే పోకో ప్రత్యేక బ్రాండ్‌గా ఏర్పడి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ చాలా మంది పోకోని షియోమీ సబ్ బ్రాండ్‌గానే చూస్తున్నారు. కంపెనీ గ్లోబల్, ఇండియన్ వెబ్‌సైట్లలో కాపీరైట్ దగ్గర "Xiaomi" అనే ఉంటుంది. దాని సేల్స్, షిప్‌మెంట్‌లు షియోమీ మార్కెట్ వాటాలోనే ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది.
పోకో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి షియోమీ నుంచి బయటకు వచ్చి పూర్తి స్వతంత్రంగా ఉండబోతుంది. తయారీ మినహా అన్ని బంధాలు తెగిపోనున్నాయి. రెండు బ్రాండ్‌లకు వేర్వేరు మేనేజ్‌మెంట్, టీమ్‌లు ఉండనున్నాయి. లోకేషన్, పరిశోధనల కూడా భాగస్వామ్యం ఉండదు. షియోమీ టీమ్‌లోని కొందరు వ్యక్తులు ప్రస్తుతం చేస్తున్న విధంగా సహాయక పాత్రను అందించడానికి బదులుగా పోకోకి శాశ్వతంగా బదిలీ అవుతారు. ఒప్పో, రియల్‌మీ ఎలా ఉన్నాయో పోకో, షియోమీ అలా ఉండనున్నాయి.
పోకో, రియల్‌మీ ప్రత్యర్థులు. వారి సోషల్ నెట్‌వర్క్‌లలో తరచుగా ఒకరినొకరు ఎగతాళి చేస్తుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండు బ్రాండ్‌లు తమ మాతృ బ్రాండ్‌లను నిర్వహించే విషయంలో ఒకే విధమైన మార్గాలను అనుసరిస్తున్నట్లు గమనించవచ్చు. ఒప్పోలో భాగంగా రియల్‌మీ ప్రారంభం అయింది. 2018లో ప్రత్యేక బ్రాండ్‌గా మారింది. దాని షిప్‌మెంట్‌లు, అమ్మకాల వాటా ఒప్పో మార్కెట్ షేర్‌లో పరిగణించబడదు. రెండు బ్రాండ్‌లు వాస్తవానికి మార్కెట్‌లోని అనేక విభాగాలలో పోటీపడుతున్నాయి. ఇప్పుడు పోకో కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమైంది.
షియోమీ వాటా నుంచి పోకో మార్కెట్‌ను తీసివేయడం వలన భారతీయ మార్కెట్లో శాంసంగ్ కంటే షియోమీ కాస్త వెనకబడవచ్చు. షియోమీకి ఇది చాలా కీలకం. 2021లో అత్యంత పోటీ ఉన్న భారతీయ మార్కెట్‌లో Poco గణనీయమైన మార్కెట్ వాటాను సంపాదించింది.
పోకో స్వతంత్ర బ్రాండ్‌గా మారితే ఎలా ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. పోకో.. షియోమీ, రెడ్‌మీలతో పరికరాలతో నేరుగా పోటీ పడుతుందా? అదే జరిగితే పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!