WhatsApp Reverse Image Search: వాట్సాప్ తన మొబైల్ వినియోగదారులతో పాటు వెబ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ఈ సిరీస్‌లో ఇప్పుడు వెబ్ యూజర్లు రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని పొందబోతున్నారు. ఈ ఫీచర్‌లో యూజర్లు గూగుల్ నుంచి తీసుకున్న ఏదైనా ఫోటోను వెంటనే వెరిఫై చేసుకోగలరు. దీంతో వారికి అందిన ఏ చిత్రం నిజమో కాదో సులభంగా కనిపెట్టవచ్చు. ఈ ఫీచర్‌పై పని జరుగుతోంది. ఇది రాబోయే అప్‌డేట్‌లో అందుబాటులోకి వస్తుంది.
ఈ ఫీచర్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
ఈ రోజుల్లో ఇంటర్నెట్ తప్పుదారి పట్టించే సమాచారంతో నిండి ఉంది. చాలా సార్లు ఫేక్ న్యూస్ అనేది ఫేక్ ఫొటోలతోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇది సమాజంలో అశాంతిని వ్యాప్తి చేస్తుంది. హింసకు కూడా ప్రమాదం ఉంది. ఇది కాకుండా ఏఐ వచ్చిన తర్వాత కూడా అలాంటి ఫొటోలు షేర్ అవుతున్నాయి. అవి చూడటానికి నిజమైనవిగా కనిపిస్తాయి. కానీ అవి తప్పుడు ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతాయి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
ఈ ఫీచర్‌తో గూగుల్ నుంచి అటువంటి ఫొటోలను వెరిఫై చేయడం సులభం అవుతుంది. వినియోగదారులు వాటి వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఫేక్ న్యూస్ నుంచి తమను తాము రక్షించుకోగలుగుతారు. ఇంటర్నెట్‌ను మెరుగైన, విశ్వసనీయమైన ప్రదేశంగా మార్చడంలో సహాయపడతారు.
ఫీచర్ ఎలా పని చేస్తుంది?
వాట్సాప్ వెబ్‌లో వస్తున్న ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు యాప్‌లో వచ్చిన ఏదైనా ఫొటోని నేరుగా గూగుల్‌లో రివర్స్ సెర్చ్ చేయగలుగుతారు. ఇప్పటి వరకు వారు చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసి రివర్స్ సెర్చ్ చేయడానికి గూగుల్‌లో అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు యాప్‌లోని ఇమేజ్ పైన కనిపించే 3 చుక్కలలో నేరుగా వెబ్ సెర్చ్ ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు గూగుల్‌లో ఏదైనా చిత్రాన్ని సెర్చ్ చేయగలరు. ఇది గూగుల్‌లో అందుబాటులో ఉంటే అసలు వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కనుగొనవచ్చు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!