Honda New Motorcycle: హోండా యునికార్న్ అప్‌డేటెడ్ మోడల్ మార్కెట్లోకి వచ్చింది. హోండా ఈ మోటార్‌సైకిల్‌లో అనేక ఫీచర్లను పొందుపరిచింది. తద్వారా ఇది మార్కెట్లో ఉన్న మిగిలిన బైకులకు గట్టి పోటీనిస్తుంది. ఈ బైక్ గత 20 ఏళ్లుగా మార్కెట్‌లో ఉంది. ఈ 20 ఏళ్లలో వాహన తయారీదారులు హోండా యునికార్న్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. హోండా యునికార్న్‌లో ఏయే కొత్త ఫీచర్లను పొందుపరిచారు? ఈ ఫీచర్లను జోడించిన తర్వాత ఈ బైక్ ధరలో ఎంత తేడా వచ్చిందో తెలుసుకుందాం. 


హోండా యునికార్న్ కొత్త ఫీచర్లు
హోండా యునికార్న్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్‌స్టాల్ చేశారు. దీంతో పాటు ఈ మోటార్‌సైకిల్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, సర్వీస్ రిమైండర్, 15W యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించారు. బైక్‌లో గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో ఇండికేటర్ కూడా ఉన్నాయి. మోటార్‌సైకిల్‌లో ఈ కొత్త ఫీచర్లన్నీ రావడంతో హోండా ఈ బైక్ అమ్మకాల ద్వారా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటోంది.



Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?


హోండా బైక్ ఇంజిన్ ఎలా ఉంది?
ఈ హోండా బైక్‌లో 163 ​​సీసీ సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ అందించారు. బైక్‌లోని ఈ ఇంజన్ 13 బీహెచ్‌పీ పవర్, 14.6 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంది. దీంతో పాటు ఓబీడీ2 (ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ 2) కూడా ఇన్‌స్టాల్ అయింది. దీని కారణంగా ఈ బైక్ లిమిట్‌కి మించి పొల్యూట్ చేయదు.


ఈ కొత్త మోడల్ ధర ఎంత?
ముంబైలో హోండా యునికార్న్ కొత్త మోడల్ ఆన్ రోడ్ ధర రూ. 1.34 లక్షల నుంచి మొదలై రూ. 1.45 లక్షల వరకు ఉంటుంది. హోండా తీసుకొచ్చిన ఈ కొత్త బైక్ మూడు కలర్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, రేడియంట్ రెడ్ మెటాలిక్ కలర్‌లను కలిగి ఉంది.



Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!