Ammayi garu Serial Today Episode రూపని సూర్యప్రతాప్ ఓదార్చి పడుకోపెడతాడు. ఇక రాజు కూడా బంటీని పడుకోపెడతాడు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు నీకు తోడు లేడు కనీసం నీ బిడ్డ బతికి ఉన్నా నువ్వు సంతోషంగా ఉండేదానివి అని అనుకుంటాడు సూర్య. బంటీ బాబాతో తన తండ్రి తన మీద ఎందుకు అరిచాడో తెలీడం లేదని అనుకుంటాడు. ఇక రూప కూడా రాజు బిడ్డని మోసినా తనని చూడటానికి రాలేదని రాజు మీద కోపంగా ఉండాలి అని అనుకుంటుంది.


ఉదయం బంటీ స్కూల్‌కి రెడీ అయితే ముత్యాలు బంటీకి ఇష్టమైన బోండాలు తినిపిస్తుంది. ఇక రూప దీపుని స్నానం చేయిస్తే దీపు పరుగులు తీస్తాడు. దీపుని స్కూల్‌లో జాయిన్ చేస్తారు. రూప దీపుకి జాగ్రత్తలు చెప్తుంది. ఇక బంటీ పింక్ కలర్ బాక్స్ కొనమని అంటే రాజు అరుస్తాడు. ఏం కావాలి అన్నా పింక్ కలరే అడుగుతున్నాడని అది నాకు ఇష్టం లేదని అంటాడు. ఇక దీపుకి పింక్ బాక్స్ రూప ఇస్తే నాకు పింక్ నచ్చదు. పింక్ గల్స్ కలర్ నాకు వద్దు అని విసిరేస్తాడు. ఇక దీపక్ అయితే దీపుని తిడితే సూర్య వద్దని వాడికి ఇష్టమైనదే కొనిస్తే కదా వాడు చక్కగా చదువుకుంటాడని అంటాడు. ఇక రాజు మీ అందరూ బంటీని గారంభం చేయడం వల్లే ఇలా అయ్యాడని అంటాడు. ఇక రూప దీపు ఇష్టం కాదని మన ఇష్టమే అంటే దానికి సూర్య ఈ మణిదీప్ మీద మన కంటే అక్కయ్యా దీపక్‌లకే ఎక్కువ హక్కు ఉంది వాళ్లు చెప్పినట్లు చేయమని అంటాడు. అలా కుదరదు అని మందారానికి నేను మాట ఇచ్చానని రూప అంటుంది. మందారం దీపుని ఎలా చూసుకుంటుందో నేను అలాగే చూసుకుంటానని అంటుంది. 


బంటీ: నాన్న మా ఫ్రెండ్స్ అందరి అమ్మలు వాళ్లకి కావాల్సినవి కొనిపెడుతున్నారు నాకు అమ్మ ఉన్నా అంతే కదా
రాజు: అమ్మ అమ్మ అమ్మ నీకు అమ్మ వద్దురా నీకు అన్నీ నేనే. ఇంకొరితో పోలిక వద్దు. అందరితో మనకు పోలిక ఏంటి బంటీ. నువ్వు ఎవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం హీరోవే.
బంటీ: నువ్వు నాకు హీరోవే నాన్న.
రాజు: ఇంకెప్పుడు ఆ పింక్ కలర్ టాపిక్ తీసుకురాకు.
రోహిణి: ఎలా రాజు ఎలా అమ్మ టాపిక్ తీసుకురాకుండా ఉంటారు. బంటి అడిగిన దాంట్లో తప్పేముంది. చిన్న పిల్లలు ఎవరైనా అమ్మనే అడుగుతారు.
విజయాంబిక: వాడికి అన్నీనువ్వే చూద్దువులేమ్మా రేయ్ దీపక్ మణిదీప్‌ని స్కూల్‌లో జాయిన్ చేయడానికి నువ్వు వెళ్లురా. 
సూర్య: నా క్యాంప్ ఆఫీస్ అటే కదా నేను వెళ్తాలే.
విజయాంబిక: అలా కాదు తమ్ముడు స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు పేరెంట్స్‌లో ఎవరో ఒకరు ఉండాలి కదా అమ్మ లేదు నాన్న ఉన్నాడు కదా అని.
రూప: అదేంటి  అత్తయ్య నేను లేనా నేను సరిపోనా.
సూర్య: అమ్మ రూప నువ్వు గార్డీనియన్ అవుతావు కానీ అమ్మవు కాదుకమ్మా. వాడు పిలుచుకోవడానికి నువ్వు అమ్మ అయినా సంతకం పెట్టడానికి అమ్మవి కాలేవమ్మా.
విజయాంబిక: తమ్ముడు నువ్వు ఏం అనుకోకపోతే మా రూపకి కూడా అంగీకారం అయితే నాది ఒక మాట తమ్ముడు. అది మా దీపక్‌కి భార్య లేదు. రూపకి భర్త ఉన్నా లేనట్లే. దీపక్‌కి తల్లి లేని లోటు తీర్చడానికి అయినా దీపక్‌ని రూపని ఒకటి చేస్తే
రూప: అత్తయ్య మీకు ఏమైనా పిచ్చి పట్టిందా నేను దీపక్‌ని పెళ్లి చేసుకోవడం ఏంటి అలా ఎలా అడుగుతారు.
రోహిణి: రాజు నీకు భార్య అవసరం లేదు కానీ బంటీకి తల్లి కావాలి. వీడి దృష్టిలో నువ్వు నాన్న అవుతావు కానీ ఎప్పటికీ అమ్మ అవ్వలేవు. నా మాట విను నిన్ను అర్థం చేసుకొని తనని కొడుకులా చూసుకొని నా లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకో.
రూప: నేను ఇంకో పెళ్లి చేసుకోవాలో లేదో అన్నది నా పర్సనల్ అత్తయ్య. దీపుకి తల్లిగా ఉంటున్నా అని దీపక్‌కి భార్యగా కావాలి అనుకోకండి అసలు నా విషయంలో మీరు తల దూర్చకండి. 
రాజు: చూడు రోహిణి అనవసరంగా నా పర్సనల్ జీవితంలో దూరకు. పెళ్లి ఒక్కసారి జరుగుతుంది అది జరిగిపోయింది. ఇప్పుడు వీడి కోసమో నీ కోసమో చేసుకోను.
రూప: చూడండి అత్తయ్య నేను రాజు మర్చిపోలేదు. రాజుతో నాకు పెళ్లి అయిపోయింది. రాజు నాతో ఉన్న లేకపోయినా రాజే నా భర్త. ఇది రాజుతో నాకు పెళ్లి అవ్వకముందు తీసుకున్న నిర్ణయం. రాజు నా గురించి ఏమనుకున్నా రాజే నా భర్తే అంతే.
రాజు: అందరికీ ఒక మాట చెప్తున్నా ఇదే చివరి సారి. నాకు పెళ్లి అయిపోయింది నాకు భార్య అంటే తనే. బంటీకి తల్లి అంటే కూడా తను మాత్రమే. తన స్థానంలోకి మరొకరు వస్తారు అని ఎవరూ అనుకోవద్దు.
అప్పలనాయుడు: ఇంత జరిగినా వీడికి అమ్మాయిగారి మీద ప్రేమ తగ్గలేదు. వీడు ఎప్పుటికైనా అమ్మాయి గారిని కలుస్తాడు.
దీపక్: చాలు ఆపు మమ్మీ నాన్న కూడా నీకు దూరంగా ఉంటారు. అంటే నాన్నకు నువ్వు అంటే ఇష్టం లేదా. మనం ఎవరు మమ్మీ వాళ్ల ఇద్దరి మధ్య దూరడానికి.
సూర్య: అక్కా చిన్న వాడు అయినా ఇన్నాళ్లకు వాడిలో మార్పు కనిపిస్తుంది. వాడిని నువ్వు చెడగొట్టకు. వాడిని చూసి బుద్ధి తెచ్చుకో. 


ఇక రూప దీపుని తానే స్కూల్‌కి తీసుకెళ్తానని తీసుకెళ్తుంది. రోహిణి ఏడుస్తుంటే ముత్యాలు ఓదార్చుతుంది. వాడు కఠినంగా మాట్లాడినా వాడి మనసు బంగారం అని అంటాడు. ఇక ముత్యాలు వాళ్లు మొక్క తీర్చుకోవాలని చీరలు కొనడానికి షాపింగ్‌కు వెళ్తారు. మరోవైపు విజయాంబిక కొడుకుకి చీవాట్లు పెడుతుంది. రూప దృష్టిలో మంచోడిని అవ్వడానికే ఇలా చేశానని దీపక్ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది అది కాదు.. అదే ఇది.. ఇంటి వారసురాలి ఇడ్లీ బండి కథ షురూ!