ప్రపంచంలోనే అత్యధిక మంది యూజర్లతో ఇన్‌స్టెంట్​ మెసేజింగ్ అప్లికేషన్‌ వాట్సాప్ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఎందుకంటే వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ముఖ్య భాగం అయిపోయింది. అందుకే తన స్థానాన్ని కాపాడుకోవడానికి, తమ యూజర్స్​ను మరింత ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగు చేస్తూ వస్తోంది. ఇక వాట్సప్ కాలింగ్‌ ఫీచర్​ను ఇంట్రడ్యూస్ చేశాక కమ్యూనికేషన్ వ్యవస్థలో పెద్ద మార్పే వచ్చింది. అందుకే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్​కు సంబంధించి వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్​ను తీసుకువస్తూనే ఉంది. అయితే తాజాగా వీడియో కాల్స్​కు మరింత ప్రాధాన్యత ఇస్తూ మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది.  


AR (ఆగ్మెంటెడ్ రియాలిటీ) కాల్ ఎఫెక్ట్స్ ,ఫిల్టర్స్​ అనే కొత్త ఫీచర్‌ను అందిస్తోంది వాట్సాప్​. వీడియో కాలింగ్​ను మరింత మెరుగ్గా, స్పష్టంగా కనిపించేలా చేసేందుకు దీనిని అందిస్తోంది. వీడియో కాల్స్​లో న్యూ లెవెల్​ పర్సనలైజేషన్, ఇంటరాక్టివిటీ కోసం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అలానే స్నాప్ చాట్​, ఇన్​స్టా గ్రామ్​ తరహాలో మరింత ఎంగేజింగ్​, ఫన్ కోసం ఇది వినియోగదారులకు సహాయ పడుతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్​ వాట్సాప్ బీటా టెస్ట్​ యూజర్స్​కు, ఐఓఎస్ యూజర్స్​కు అందుబాటులో ఉంది. త్వరలోనే మరింత మంది యూజర్లకు అందుబాటులో ఉండనున్నట్లు WBBetaInfo రిపోర్ట్ తెలిపింది. తాజాగా వీడియో కాల్స్‌ (Video calls)కి మరింత ప్రాధాన్యత ఇస్తూ కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది.


వాట్సాఫ్​ ఏఆర్ కాల్​ ఫీచర్స్​ ఇవే -​  WBBetaInfo రిపోర్ట్​ ప్రకారం, ఈ అప్డేట్ ఫీచర్​లో కలర్ ఫిల్టర్స్​, బ్యాక్​గ్రౌండ్ ఎడిటింగ్​, లోలైట్ మోడ్, టచ్​ అప్​ మోడ్ వంటివి ఉన్నాయి. 


డైనమిక్​ ఫేసియల్ ఫిల్టర్స్​ - ఇది బెటర్ వీడియో కాల్ ఎక్స్​పీరియన్స్​ కోసం బాగా ఉపయోగపడుతుంది. వీడియో కాల్​ రియల్ టైమ్​లో యూజర్స్​ ఈ ఫిల్టర్స్​ను అవసరానికి తగ్గట్టుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్లు వీడియోలోని కలర్​ టోన్​కు ఛేంజ్​ చేసుకునేందుకు అనుమతినిస్తాయి. ఇది యూజర్స్​కు మరింత మంచి ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. ఇంకా బ్యాక్​గ్రౌండ్ ఎడిటింగ్ ఫీచర్​ను కూడా అందిస్తోంది. దీంతో ప్రీ డిజైన్డ్​ సెలక్ట్​డ్​ బ్యాక్​గ్రౌండ్​ లేదా చుట్టు పక్కల వాతావరణాన్ని బ్లర్​ లేదా స్పావ్​  చేయడానికి యూజ్ అవుతుంది. మొత్తంగా బెస్ట్​ విజువల్ అప్పియరెన్స్​ను అందిస్తుంది.


లో లైట్​ మోడ్​ - సాధారణంగా వెలుతురు ఎక్కువగా ఉంటే వీడియో కాల్​లో విజువల్ బాగా కనిపిస్తుంది. వెలుతురు తక్కువగా ఉంటే స్పష్టంగా కనపడదు. అయితే ఈ లైట్ మోడ్ ఫీచర్ వల్ల వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో లైటింగ్​ అడ్జెట్​ చేసు కోవచ్చు. అందుకే కాల్​లో మాట్లాడే వ్యక్తి, మరింత కాంతివంతంగా, స్పష్టంగా కనిపించేలా లో లైట్ మోడ్ టూల్​ను ప్రవేశపెట్టింది వాట్సాప్​. కాబట్టి ఈ ఫీచర్​ మోడ్​ను ఆన్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు తమ వీడియోను మరింత స్పష్టంగా కనిపించేలా లైటింగ్ క్వాలిటీనీ పెంచుకోవచ్చు. లిమిటెడ్​ నేచురల్ లైట్​ ఉన్న పరిసరాలలో కూడా స్పష్టమైన కమ్యూనికేషన్​ను అందిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం పూట వీడియో కాల్స్​ మాట్లాడేవారికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది.


టచ్​ అప్​ మోడ్​ - ఈ నయా ఫీచర్​లో టచ్ అప్​ మోడ్ అనేది కూడా ఇచ్చింది వాట్సాప్. దీని ద్వారా వీడియో కాల్​లో​ ఫేస్, స్కిన్ ఎంతో స్మూత్​గా, అందంగా కనపడేలా చేస్తుంది. ప్రొఫెషనల్ మీటింగ్స్​, క్యాజువల్ కన్వర్​జేషన్స్​ .. ఇలా రెండింటికి సూటబుల్ అయ్యేలా దీనికి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా స్పెషల్ లైటింగ్ వంటివి లేకుండానే విజువల్స్​ను మెరుగ్గా చూపిస్తుంది.  


అలానే యూజర్​ తనకు కావాల్సిన విధంగా ఈ ఫీచర్స్​ను ఒక్కసారి సెట్ చేసుకుంటే, అవి అలానే కంటిన్యూ అయ్యేలా వెసులుబాటును కల్పిస్తోంది వాట్సాప్​. ప్రతి కాల్​కు మళ్లీ మళ్లీ మార్చుకునేలా కాకుండా,  ఒక్కసారి కావాల్సిన విధంగా ఫీచర్స్​ను ఎనేబుల్​  చేసుకుంటే, ఆటోమెటిక్​గా అవి ప్రతీ కాల్​కు అప్లై అయిపోతాయి.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?