BCCI Secretary Jay Shah has been elected as Chairman of ICC | అంతా అనుకున్నదే జరిగింది. ఐసీసీ ఛైర్మన్ గా జై షా ఎన్నికయ్యారు. బీసీసీఐ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న జై షా ఏకగ్రీవంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1వ తేదీన ఐసీసీ చైర్మన్ గా జై షా బాధ్యతలు చేపట్టనున్నారని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో మరోసారి భారతీయుడు ఐసీసీ పగ్గాటు చేపట్టనున్నారు.


గతంలో భారత్ నుంచి జగ్ మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ లు ఐసీసీ ఛైర్మన్ గా వ్యవహరించారు. తాజాగా ఐసీసీ ఛైర్మన్ గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో ఐసీసీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టనున్న ఐదో భారతీయుడిగా జై షా నిలవనున్నారు. కేవలం 36 ఏళ్ల వయసులో ఐసీసీ పగ్గాలు చేపట్టనున్న పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నారు.