WhatsApp: వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో వినియోగదారులు తమ లాక్ స్క్రీన్ నుండి నేరుగా స్పామ్‌ కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయవచ్చు. ఈ అప్‌డేట్ స్పామ్ మెసేజ్‌ల వ్యాప్తిని పరిష్కరించడం, వినియోగదారులకు వారి మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మరింత కంట్రోల్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్ వంటి మెసేజింగ్ నెట్‌వర్క్‌లకు స్పామ్ మెసేజ్‌లు చాలా కాలంగా ఆందోళన కలిగిస్తున్నాయి.


స్పామ్ మెసేజ్‌ల కారణంగా ప్రమోషనల్ కంటెంట్, మోసపూరిత కంటెంట్ నుంచి వినియోగదారులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు స్పామ్ సందేశాల ద్వారా మోసానికి గురయ్యారు. అటువంటి పరిస్థితిలో వాట్సాప్ తెచ్చిన ఈ ఫీచర్ చాలా ముఖ్యమైనది. దీని ద్వారా వినియోగదారులు తమ లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ మెసేజ్‌లపై యాక్షన్ తీసుకోగలరు. వాటిని బ్లాక్ చేయగలరు.


ఈ ఫీచర్‌ని అమలు చేయడం వెనుక వాట్సాప్ ప్రధాన లక్ష్యం దాని వినియోగదారులకు గొప్ప మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడంతోపాటు వారి ప్రైవసీ, సెక్యూరిటీని పెంచడం. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ వినియోగదారులు వారి డివైస్‌ను అన్‌లాక్ చేయకుండా లేదా యాప్ ఓపెన్ చేయకుండానే స్పామ్ మెసేజ్‌లను గుర్తించడానికి, బ్లాక్ చేయడానికి అనుమతిస్తుంది. లాక్ స్క్రీన్‌పై స్పామ్ మెసేజ్ గురించిన నోటిఫికేషన్ కనిపించినప్పుడు పంపినవారిని వెంటనే బ్లాక్ చేసే ఫీచర్‌తో సహా మరిన్ని ఆప్షన్లను చూడటానికి వినియోగదారులు నోటిఫికేషన్‌పై లాంగ్ ప్రెస్ చేయవచ్చు. దీంతోపాటు మెసేజ్ చేసే వారికి రిపోర్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది.


ప్రస్తుతం వినియోగదారులు ప్రతిరోజూ వాట్సాప్‌లో చాలా స్పామ్ సందేశాలను పొందుతూనే ఉన్నారు. దీని కారణంగా వినియోగదారులు మానసికంగా డిస్టర్బ్ అవ్వడమే కాకుండా కొన్ని నకిలీ లేదా తప్పుడు ప్రకటనల బారిన పడి మోసానికి గురవుతారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


మరోవైపు అసుస్ క్రోమ్‌బుక్ సీఎం14 ల్యాప్‌టాప్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ కొంపానియో ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. ఈ ల్యాప్‌టాప్ మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్‌తో రానుందని అసుస్ అఫీషియల్‌గా తెలిపింది. 180 డిగ్రీల లే ఫ్లాట్ హింజ్డ్ డిస్‌ప్లేతో ఈ ల్యాప్‌టాప్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని ద్వారా వినియోగదారులు ల్యాప్‌టాప్‌ను చాలా ఈజీగా ఉపయోగించవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 15 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ల్యాప్‌టాప్ అందించనుండటం విశేషం. దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ ల్యాప్‌టాప్ ధరను మనదేశంలో రూ.26,990గా నిర్ణయించారు. గ్రావిటీ గ్రే కలర్ ఆప్షన్‌లో అసుస్ క్రోమ్‌బుక్ సీఎం14ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ సేల్‌కు అందుబాటులో ఉంది. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఆరు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందించనున్నారు.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?