Telangana Assembly Approves Hookah Parlours Prohibition Bill: రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధించారు. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం హుక్కా పార్లర్ల నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డి తరఫున బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై ఎలాంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా శాసనసభ బిల్లుకు ఆమోదం తెలిపింది. 'సిగరెట్ కంటే హుక్కా పొగ మరింత హానికరం. బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. దీన్ని సేవించిన వారికే కాకుండా వారి వల్ల చుట్టుపక్కల ఉండే వారికి కూడా ప్రమాదం. హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం.' అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Telangana Assembly: హుక్కా పార్లర్లపై నిషేధం - సంబంధిత బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
Ganesh Guptha
Updated at:
12 Feb 2024 12:30 PM (IST)
Hookah Parlours Prohibition: రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధించే బిల్లుకు సోమవారం తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు.
హుక్కా పార్లర్లపై నిషేధం బిల్లుకు ఆమోదం