BRS MLA KTR On Krishna Irrigation Projects: కృష్ణా ప్రాజెక్టుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేస్తున్నారని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను కేటీఆర్ అందించారు. రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి తమ పార్టీ చేసిన ఒత్తిడే కారణమని ట్వీట్ చేశారు. 


మాజీ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్ అకౌంట్‌లో ఏమన్నారంటే... చలో నల్గొండ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా 13న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కచ్చితంగా బీఆర్ఎస్ సాధించిన మొదటి విజయం.