WhatsApp Upcoming Feature: వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. తద్వారా యాప్ యూజర్లకు వినియోగం మరింత సులభం అవుతుంది. అందుకే వాట్సాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌గా నిలిచింది. ఇప్పుడు వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌పై పని చేస్తోంది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ నుంచి థర్డ్ పార్టీ యాప్‌లతో ఛాట్ చేయగలుగుతారు. వాస్తవానికి మెటా తీసుకువచ్చిన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ థర్డ్ పార్టీ యాప్‌లతో ఛాటింగ్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత యూజర్లు వాట్సాప్ నుండే ఏదైనా ఇతర యాప్‌కి మెసేజ్‌లు పంపగలరు.
యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ చట్టం తీసుకొచ్చిన ఒత్తిడితో ఈ ఫీచర్‌ను మార్చి నాటికే అందుబాటులోకి తీసుకురావచ్చని సోషల్ మీడియాలో ఒక వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ ఇంజనీరింగ్ డైరెక్టర్ డిక్ బ్రోబర్ వాట్సాప్ తన 200 కోట్ల మంది వినియోగదారులకు థర్డ్ పార్టీ యాప్‌లతో ఛాటింగ్ చేసే సదుపాయాన్ని అందించడానికి ఇంటర్‌ఆపరబిలిటీని అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. వాట్సాప్ ప్రైవసీ, సెక్యూరిటీ, యూనిటీని దృష్టిలో ఉంచుకుని థర్డ్ పార్టీ యాప్‌లకు ఇంటర్‌ఆపరబిలిటీని అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
టెలిగ్రామ్ సపోర్ట్ చేస్తుందా లేదా?
వాట్సాప్ అతిపెద్ద ప్రత్యర్థి టెలిగ్రామ్... ఈ ఇంటర్‌ఆపరబిలిటీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందో లేదో ఇంకా ఖచ్చితమైన సమాచారం అందలేదు. వాట్సాప్‌కు టెలిగ్రామ్ మొదటి నుంచి గట్టి పోటీని ఇస్తుందని, ఈ యాప్‌లో వినియోగదారులు వాట్సాప్‌లో అందుబాటులో లేని కొన్ని ఫీచర్‌లను పొందుతారు. అటువంటి పరిస్థితిలో టెలిగ్రామ్, వాట్సాప్ వినియోగదారులు ఒకరి యాప్‌ల ద్వారా ఒకరితో ఒకరు చాటింగ్ చేయడం ప్రారంభిస్తే అది నిజంగా అద్భుతమైన ఫీచర్ అవుతుంది.
అయితే మెటా తన ఇతర ఛాటింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌బుక్ మెసెంజర్, ఇతర ఛాటింగ్ యాప్‌లకు మద్దతుని ఇచ్చేందుకు సిద్ధం అయింది. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత వినియోగదారులు టెక్స్ట్ మెసేజింగ్, ఫోటోలు పంపడం, వాయిస్ మెసేజ్‌లు పంపడం, వీడియోలను పంపడం, ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం వంటి ఫీచర్లను ఉపయోగించగలరు. ప్రస్తుతం ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ వినియోగదారులు... ఇతర యాప్‌ల యూజర్లతో గ్రూప్ ఛాట్ లేదా కాల్ చేయలేరు. దీన్ని తర్వాత యాడ్ చేయనున్నారు.
వాట్సాప్ గత ఏడాది తన నిబంధనలను కూడా మార్చింది. యూజర్లు గూగుల్ అకౌంట్‌లో ఉచితంగా చేసుకునే చాట్ బ్యాకప్‌ను త్వరలో కౌంట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మీరు వాట్సాప్ బ్యాకప్ చేసినప్పుడు గూగుల్ ఖాతాలో సేవ్ అవుతుంది కదా. అది ఇప్పటివరకు ఎంత డేటా అయినా కూడా ఉచితంగా అయ్యేదన్న మాట. అయితే ఇకపై మీకు గూగుల్ ఖాతాలో లభించే 15 జీబీ డేటాలోనే వాట్సాప్ బ్యాకప్ కూడా కౌంట్ అవుతుందన్న మాట. అక్కడ స్టోరేజ్ తక్కువగా ఉంటే మీరు అదనపు స్టోరేజ్ కోసం చెల్లించాల్సి ఉంటుందన్న మాట. అసలు ఈ గొడవే వద్దు అనుకుంటే చాట్ బ్యాకప్‌ను పూర్తిగా ఆఫ్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. ఈ అప్‌డేట్ ఈ ఏడాది జులై నాటికి అందరికీ అమలు కానుందని తెలుస్తోంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?