Tirupati Rush : గడిచిన వారం రోజులు నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంది. ప్రతిరోజూ మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుండడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. గత శనివారం నుంచి మంగళవారం వరకు ప్రతిరోజూ 50 వేలు నుంచి 70 వేల మంది వరకు భక్తులు దర్శనం చేసుకున్నారు. బుధవారం కూడా భారీ సంఖ్యలోనే భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. బుధవారం ఒక్కరోజే 65,683 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వీరిలో తలనీలాలను 21,177 మంది భక్తులు సమర్పించారు. భక్తుల సమర్పించిన కానుకలు ద్వారా హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు రూపాయలు సమకూరింది. గురువారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం తిరుపతిలో స్వామి వారి దర్శనానికి మూడు కంపార్లమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటలు సమయం పడుతోంది. గడిచన వారం రోజుల్లో స్వామి వారి దర్శనానికి అతి తక్కువ సమయం గురువారం పడుతోంది. బుధవారం 15 నుంచి 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారానికి భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నాలుగు గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేశారు.