AP TET 2024 Online Application: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7న ఏపీ టెట్ (APTET)-2024 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న టెట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఫీజు చెల్లించేందుకు ఫిబ్రవరి 17గా నిర్ణయించారు. అభ్యర్థులు మాక్ టెస్ట్ రాసేందుకు ఫిబ్రవరి 19న అవకాశం కల్పించారు. టెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 నుంచి హాల్‌‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు  కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయారోజుల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రాథమిక 'కీ' మార్చి 10న విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై మార్చి 11 వరకు ఈ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం మార్చి 13న టెట్ తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. మార్చి 14న టెట్‌ తుది ఫలితాలు విడుదల చేయనున్నారు.  డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 


టెట్ అర్హతలు..


➥ ఒకటవ తరగతి నుంచి 5 వరకు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు నిర్వహించే టెట్‌-1 పేపర్‌కు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (బీఈఎల్‌ఈడీ) చేసిన వారే అర్హులు. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. 


➥ పేపర్-1 పరీక్ష రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 


 


➥ ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్‌ పేపర్‌–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఈసారి నుంచే ఈ నిర్ణయాలను అమలుచేయనున్నారు.


➥ గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించి, డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టీజీటీ వారికి ఇంగ్లిష్ లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.


AP TET 2024 Notification


Online Application


ముఖ్యమైన తేదీలు..



డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 7న విడుదలచేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం 3 గంటలకు  నోటిఫికేషన్ విడుదలచేశారు. త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు వెలువడనున్నాయి.


ఏపీ డీఎస్సీ-2024 పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..