Trinayani Today Episode

  


తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వస్తారు. వాళ్లని విశాల్ ఫాలో అవుతాడు. ఇక హాసిని కూడా విశాల్‌, నయనిలకు తెలీకుండా అక్కడికి వస్తుంది. హాసిని గన్‌ తీసుకొని వస్తుంది. ఇక హాసిని ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చానని ఎవరు ఏమన్నా ఫీలవకూడదు అని ఫిక్స్ అవుతుంది. మరోవైపు గాయత్రీ దేవి పునర్జన్మ ఎత్తాక ప్రతీక్షణం నిన్ను చంపేందుకే ప్రయత్నిస్తుంది తిలోత్తమా అని అఖండ స్వామి అంటారు. దీంతో తిలోత్తమ, వల్లభలు భయపడతారు.


తిలోత్తమ: ఇప్పటి వరకు తను ఎదురుపడనే లేదు నా మీద ఎలా దాడి చేస్తుంది.
విశాల్: అఖండ స్వామి గాయత్రీ పాపే నా కూతురుగా పుట్టిన మా అమ్మ అని డైరెక్ట్‌గా చెప్పకపోయినా అలాంటి వారికున్న మహాత్తులో పరోక్షంగా అయినా చెప్పేస్తాడు ఏమో. అని గన్ తీస్తాడు విశాల్..
వల్లభ: మమ్మీ నీకు తెలిసో తెలీకో ఎదురైన అని సంఘటనలు గాయత్రీ పెద్దమ్మ వల్లే అని చెప్పేస్తారు ఏమో ఈ స్వామి. 
అఖండ: మూర్ఖుడా సత్యం తెలుసుకోకుండా మాట్లాడకు. కళ్ల ముందు నిజం ఉన్నా అబద్ధం అనే భ్రమలో బతికే మూర్ఖుడివి నువ్వు. 
హాసిని: ఎవరి టైం ఎప్పటి వరకో విశాల్ డిసైడ్ చేస్తారు అనుకున్నా కానీ పెంచిన తల్లి అన్న జాలితో తను డ్రాప్ అయితే నయని చెల్లి అన్నట్లుగానైనా నరరూపరాక్షసి అయినా తిలోత్తమ అత్తయ్యని ఈ రోజు చంపాలని నేను కూడా సిద్ధంగా వచ్చాను. 
అఖండ: మీ వల్ల గాయత్రీ దేవికి గండం అని చెప్పాను కానీ ఇప్పుడు చెప్తున్నా మీ వల్ల నాకు కూడా ప్రాణ గండమే తిలోత్తమ.
తిలోత్తమ: అదేంటి స్వామి మీకు శత్రువులు ఎవరు ఉంటారు. 
విశాల్: నేనే అమ్మా అఖండ స్వామి నాకు శత్రువు కాదు కానీ మీరు అతని సలహా పాటించి ఇక్కడి దాకా వచ్చారు. నిన్న మిస్ అయింది ఈరోజు మిస్సవదు. కానీ రేపు మాత్రం మీరు గాయత్రీ పాప గురించి నిజం తెలుసుకుంటారు. ఎవరికి ఆపద వచ్చినా తెలుసుకునే నయనికీ తన కన్న బిడ్డలకు ఆపద వస్తే తెలీదు. అందుకే మీరు మళ్లీ మళ్లీ ఈ స్వామిని ఆశ్రయించకూడదనే ఈ స్వామిని చంపేస్తా..
హాసిని: ఒకవేళ విశాల్ చివరి క్షణంలో అయినా మనసు మార్చుకుంటే నేను మరుక్షణమే అత్తయ్యని చంపేస్తా..


విశాల్, హాసినిలు ఇద్దరూ గన్‌ను గురి చూస్తారు.  మరోవైపు అఖండ స్వామి తిలోత్తమ, వల్లభలను వెళ్లిపోమని చెప్తారు. ఇక విశాల్ గన్ పేల్చినప్పుడే పేలదు. ఏమైందని చూస్తే గన్‌లో బులెట్స్ ఉండవు. ఏమైందని చూస్తూ నయని బులెట్స్ తీసేయడం చూపిస్తారు. ఇక తిలోత్తమను చంపాలని హాసిని గన్ షూట్ చేస్తే అది వల్లభ కాలికి తగిలిపోతుంది. వల్లభను ఎవరు షూట్ చేశారని విశాల్ షాక్ అవుతాడు.   ఇక తిలోత్తమ, అఖండ స్వామిలు వల్లభను హాస్పిటల్‌కి తీసుకెళ్తారు.


విశాల్: తనలో తాను.. వల్లభ అన్నయ్యని ఎవరు కాల్చుంటారు. అసలు తను ఎవరికీ టార్గెట్‌ కాదుకదా.. 
నయని: బాబు గారు అందరూ ఏమైందా అని టెన్షన్ పడుతుంటే మీరు ఇక్కడే ఉండిపోయారు. ఎందుకు.
విశాల్: అందరికీ తెలిసిపోయింది. 
నయని: ఏ విషయం..
విశాల్: ఏం లేదు నువ్వే చెప్పు.. 
నయని: అత్తయ్య బావగారు ఎక్కడికి వెళ్లారో కానీ ఎవరో రివాల్వర్‌తో షూట్ చేస్తే కాలికి గాయం అయింది. 
విశాల్: నువ్వేందుకు చెప్పలేదు నయని..
నయని: ఇప్పుడు చెప్పాను కదా..
విశాల్: అంతా అయిపోయాక చెప్తే లాభం ఏముంది.
నయని: ప్రమాదం జరగకముందే చెప్పాలా..
విశాల్: ఎవరికి ఏమువుతుందో ముందే చెప్పే నువ్వు అన్నయ్యకి ఇలా అవుతుంది అని ఎందుకు చెప్పలేదు. 
నయని: మీరెందుకు చెప్పలేదు ఆఫీస్‌కు వెళ్లలేదు అని.. అర్జెంట్ మీటింగ్ ఉందని ఇంట్లో నుంచి వెళ్లిన మీరు ఆఫీస్‌కు ఎందుకు వెళ్లలేదు. సరే.. ఎక్కడ ఏదో జరిగితే ఇంట్లో ఉండే నేను చెప్పలేదు అని నన్ను నిలదీస్తున్నారు. 
విశాల్: సారీ నయని ఏదో టెన్షన్‌లో అలా అనేశాను.
నయని: నేనేం ఫీలవ్వలేదు బాబుగారు. ఎందుకు అంటే మీరు అనుకున్న పని జరగలేదు కదా.. గండం వస్తే నాకు ముందే తెలిస్తే.. ఎలాగూ నాకు తెలుస్తుందిలే అని నాకు చెప్పకుండా వెళ్లారు.
విశాల్: అపార్థం చేసుకోకు నేను ఒక పని మీద వెళ్తే అక్కడ ఇంకొకటి జరిగింది. 
నయని: జరుగుతుంది. ఎందుకోతెలుసా.. మీరు పట్టుకెళ్లిన రివాల్వర్‌లో బులెట్స్ లేవు బాబుగారు. ఆఫీస్‌కు వెళ్తాను అన్న మీరు వేటకు వెళ్లారు అంతేకదా.. 


అందరూ తిలోత్తమ, వల్లభల రాకకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో హాసిని కాల్చేవాడు ఛాతికో, చేయికో కాల్చాలి కానీ కాలికి కాల్చడం ఏంటి అని అంటుంది. అందరూ షాక్ అవుతారు. నీకు ఎవరు చెప్పారు అని అడుగుతారు. దీంతో హాసిని కవర్ చేస్తుంది. ఇంతలో తిలోత్తమ వాళ్లు వస్తారు. ఇక హాసిని తల్లీ కొడుకులు ఇద్దరూ ఒకేదగ్గర ఉంటారు కదా గురి తప్పి ఉంటే మీ ప్రాణం పోయేదని అంటుంది. 


విక్రాంత్: అమ్మా ఎవరిమీదైనా అనుమానం ఉందా..
తిలోత్తమ: ఉంది..
సుమన: ఎవరి మీద అత్తయ్య..
తిలోత్తమ: నీ మీదే.. 
సుమన: అయ్యో అత్తయ్య పెద్ద బావగారితో నేను మాట్లాడేదే తక్కువ ఆ పని నేను ఎందుకు చేస్తాను.
విశాల్: అమ్మా ఆ అవసరం తనకెందుకు ఉంటుంది.
తిలోత్తమ: నా అనుమానం వల్లభను షూట్ చేసిన వాళ్లమీద కాదు విశాల్. నీ కన్న తల్లి గాయత్రీ దేవి జాడ తెలీకుండా చూపులమ్మ తల్లిని కింద పడేలా చేసిన వారిమీద.
నయని: మీ బిడ్డకు ఏమైనా పర్లేదు కానీ నా బిడ్డ జాడ తెలుసుకోవాలి అని మీలోని ఆరాటం ఏమాత్రం తగ్గదు అత్తయ్య.
తిలోత్తమ: తగ్గదు. నిన్న చూపులమ్మ దీపం పెడుతున్నప్పుడు ఏమైనా జరుగుతుంది అని సుమన పక్కకు వెళ్లిపోయింది. ఇక మనసులో ఇరుక్కున్నాను అని సుమన అనుకుంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: షారుఖ్ ఖాన్: ఓటీటీకి వచ్చేస్తోన్న 'డంకీ' - స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..