Whatsapp New Features: వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడు దాని ఇంటర్‌ఫేస్‌లో ఇప్పుడు పెద్ద మార్పులు చూడవచ్చు. వాట్సాప్ యాప్ కింద భాగంలో నాలుగు నావిగేషన్ ట్యాబ్‌లను అందిస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫీచర్ కొందరికి అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్ చేసిన విజువల్ ఇంటర్‌ఫేస్ యాప్ బీటా వెర్షన్‌లో కొంత కాలం నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు అందరు యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఛాట్స్, కాల్స్, అప్‌డేట్స్, కమ్యూనిటీస్‌కు ప్రత్యేకమైన ట్యాబ్స్ అందించారు. దీంతో యూజర్లు సింపుల్‌గా సింగిల్ హ్యాండ్‌తో కావాల్సిన ట్యాబ్‌కు షిఫ్ట్ అవ్వవచ్చు.


వాట్సాప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో దీని గురించి టీజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్‌కు చాలా మార్పులు జరిగాయి. యాప్ కూడా చూడటానికి చాలా కొత్తగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది.






యాప్‌లో ట్యాబ్స్‌ను బొటనవేలికి దగ్గరగా ఉంచటమే ఇందులో పెద్ద ప్లస్. దీంతో అరచేతిలో ఫోన్ పట్టుకుని బొటనవేలి సాయంతో కావాల్సిన ట్యాబ్‌కు సులభంగా షిఫ్ట్ కొట్టవచ్చు. కానీ సెర్చ్ బటన్ మాత్రం పైభాగంలోనే ఉంది. అంటే మీరు దేన్నైనా సెర్చ్ చేయాలంటే యాప్ పైభాగంలోకి వెళ్లాల్సిందే. వాట్సాప్ ఐవోఎస్ యాప్‌లో కూడా పలు మార్పులు చేశారు. ఇప్పుడు కింది భాగంలో ఐదో వరుసలో సెట్టింగ్స్‌ను చూడవచ్చు.


ఈ ఫీచర్ చాలా కాలం నుంచి యాప్‌లో టెస్టింగ్‌లో ఉంది. ఎట్టకేలకు దీన్ని అందరు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వాట్సాప్ తన యాప్ కోసం ఎన్నో ఫీచర్లను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూనే ఉంది. వాట్సాప్ యాప్ నుంచి ఇంటర్నేషనల్ పేమెంట్స్ చేసే ఆప్షన్‌ను కూడా పరిశీలిస్తున్నారు.


దీంతోపాటు వాట్సాప్ ఏఐ ఆధారిత ఫీచర్లపై కూడా పనిచేస్తుంది. దీంతో టెక్స్ట్ ప్రాంప్ట్స్ ద్వారా స్టిక్కర్లను క్రియేట్ చేయవచ్చు. అలాగే వాట్సాప్ ఇటీవలే ఏఐ ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్లను డెవలప్ చేస్తూ కనిపించింది. ఈ ఫీచర్లన్నీ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.










Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?