WhatsApp Group Chat feature: త్వరలో వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో కూడా వాయిస్ ఛాట్ ఆప్షన్ యాడ్ చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇది కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. గ్రూప్‌లోని సభ్యుల్లో ఎవరైనా వాయిస్ చాట్‌ని ప్రారంభించవచ్చు. గ్రూప్‌లోని వ్యక్తులు ఎప్పుడైనా అందులో చేరవచ్చు. ఛాట్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ దాని నుంచి బయటకు వచ్చేస్తే 60 నిమిషాల తర్వాత అది ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది. అంటే ఎవరైనా దాన్ని ఎవరూ కట్ చేయకపోతే ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది. ఈ ఫీచర్ సహాయంతో గ్రూప్స్‌లోని వ్యక్తులు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వవచ్చు.


ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo షేర్ చేసింది. వాయిస్ ఛాట్ ఫీచర్ కింద కేవలం 32 మందిని మాత్రమే ఇందులో చేర్చుకోవచ్చు. ఏ గ్రూప్స్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది అనే సమాచారం ఇంకా అందుబాటులో లేదు. అంటే గ్రూప్స్‌లో ఎంత మంది ఉంటే ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు అన్నది తెలియరాలేదు. వాయిస్ ఛాట్‌కు, కాల్‌కు తేడా ఏంటి? అనే డౌట్ కూడా చాలా మందికి వచ్చే అవకాశం ఉంది. మరి దీని వల్ల ప్రయోజనం ఏంటి?


ఈ ఫీచర్ ప్రయోజనం ఏంటి?
దీని వల్ల ఉపయోగం ఏంటంటే... మీరు అవతలి వ్యక్తి ఫోన్‌ను రింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే వాయిస్ ఛాట్‌ను స్టార్ట్ చేయవచ్చన్న మాట. గ్రూప్‌లో ఉన్న వారికి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. దాని ద్వారా ఈ వాయిస్ ఛాట్‌లో జాయిన్ అవ్వవచ్చు.


వాట్సాప్ ఇతర ఫీచర్ల మాదిరిగానే, ఈ ఫీచర్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొన్ని బీటా టెస్టర్లతో మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో కంపెనీ దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు.


యూజర్ నేమ్ ఫీచర్ కూడా!
వాట్సాప్ చాలా కాలంగా యూజర్‌నేమ్ ఫీచర్‌పై పనిచేస్తోంది. ఈ ఫీచర్ లైవ్‌లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక యూజర్ నేమ్‌ను ఎంచుకోవాలి. యూజర్ నేమ్ సహాయంతో ప్రజలు ఒకరినొకరు వాట్సాప్‌కి యాడ్ అవ్వవచ్చు. అంటే వారు నంబర్‌ను పంచుకోవాల్సిన అవసరం ఉండదన్న మాట.


అంతే కాకుండా వాట్సాప్ కొత్త సేఫ్టీ టూల్స్ ఫీచర్‌పై పని చేస్తోందని తెలుస్తోంది. అంటే ఒకవేళ మీకు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తే తర్వాత ఏమి చేయాలో వాట్సాప్‌నే మీకు సలహా ఇస్తుందన్న మాట. ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ డెవలప్‌మెంట్లను పరిశీలించే వెబ్‌సైట్ Wabetainfo అందించింది. సేఫ్టీ టూల్స్ ఫీచర్ కింద వాట్సాప్ మీకు తెలియని నంబర్‌ నుంచి మెసేజ్ వస్తే ఏం చేయాలని మీకు దిశానిర్దేశం చేసే పాప్ అప్ స్క్రీన్‌ను చూపిస్తుందన్న మాట.


Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial