YS Jagan Visits Flood Affected Area:
అటు వరద బాధితుల పరామర్శ... ఇటు పార్టీ వ్యవహరాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల టూర్ ఆసక్తిగా మారింది..


గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటన...
ఇటీవల గోదావరి జిల్లాల్లో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.  అయితే వరద ప్రాంతాల్లో సీఎం జగన్ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం పరంగా వరద ప్రాంతాల్లో అందించిన సేవలు, బాధితులకు నష్టపరిహరం తో పాటుగా ఇతర మౌళిక సదుపాయాల వ్యహరాల పై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీసేందుకు రెండు రోజులు పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో పర్యటన చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో బాధితులతో జగన్ నేరుగా ముఖా ముఖి కార్యక్రమాలు కూడ నిర్వహించి, బాదితులతో మాట్లాడి సహయ చర్యల పై వారి అభిప్రాయాలు పరిశీలించి, అక్కడికక్కడే అధికారులకు కూడ ఆదేశాలు ఇచ్చారు.. 


చాలా రోజుల తరువాత జిల్లాలో నైట్ హాల్ట్...
సీఎం వైఎస్ జగన్ జిల్లాల వారీగా టూర్ లు వెళ్ళిన సమయంలో ఒక్క రోజులో షెడ్యూల్ ను ముగిస్తారు. రాష్ట్రంలోని 26జిల్లాల్లో ఎక్కడయినా ముఖ్యమంత్రి జగన్ పర్యటించిన సమయంలో సాయంత్రం లేదా రాత్రికి అదే రోజు తాడేపల్లలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకునే విధంగా ఆయన షెడ్యూల్ ప్లానింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన ఎ జిల్లా షెడ్యూల్ చూసినా ఇలానే ఉంటుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి జయంతి , వర్దంతి కార్యక్రమాలకు మాత్రం కడప, రాయల సీమ జిల్లాల్లో టూర్ కు మాత్రమే రెండు నుండి మూడు రోజుల షెడ్యూల్ ఉంటుంది. అయితే వరద ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ మాత్రం రెండు రోజుల పాటు సాగనుంది. 


గతంలో వరదలు వచ్చినప్పుడు కూడ సీఎం జగన్ నైట్ హాల్ట్ గోదావరి జిల్లాలో చేశారని పార్టి నాయకులు చెబుతున్నప్పటికి, ఈ సారి నైట్ హాల్ట్ వ్యవహరం మాత్రం అందరికి ఆసక్తి కరంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ గోదావరి జిల్లాలో పైట్ హాల్ట్ వ్యవహం అనగానే పార్టికి సంబందింధించి క్యాడర్ లో కూడ ఆసక్తిగా ఉంటుంది. పార్టీకి సంబందించిన వ్యవహరాలు, నాయకుల మద్య విభేదాలు తో పాటుగా నియోజకవర్గాల వారీగా పరిస్దితులు పై కూడ ముఖ్యమంత్రికి స్దానిక నాయకత్వం వివరాలు అందించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో సీఎం షెడ్యూల్ లో పార్టీ వ్యవహరాలకు సంబందించిన కోణం కూడ లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.


ఇటీవల పవన్ టూర్...
ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ద్వారా పర్యటించారు. ఆయన టూర్ కు గోదావరి జిల్లాల నుండి పెద్ద ఎత్తన స్పందన లభించింది. దీని పై కూడా సీఎం జగన్ అప్పుడే పార్టీ నేతలను సమాచారం ఆరా తీశారు. వారాహి యాత్ర ద్వార పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కూడ రాజకీయంగా కీలకంగా మారాయి. గోదావరి జిల్లాల నుండి పవన్ కు స్పందన భారీగా లభించటం కూడ అధికార పార్టిలో చర్చనీయాశంగా మారింది. ఈ నేపద్యంలో వరద బాధితుల పరామర్శకు వెళ్ళిన ముఖ్యమంత్తి జగన్ మోహన్ రెడ్డి, రెండు రోజుల పాటు గోదావరి జిల్లాల్లోనే మకాం వేయటంతో పాటుగా పార్టి వ్యవహారాలను కూడ రివ్యూ చేయటం ఆసక్తిగా నెలకొందని పార్టి లో చర్చ జరుగుతోంది.