WhatsApp New Feature: ఛాటింగ్ అనుభవాన్ని మరింత మార్చే కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. వాస్తవానికి వాట్సాప్ ఛాట్‌లో ఫోటోలు, వీడియోలు, జిఫ్‌లను ఓపెన్ చేసేటప్పుడు కంపెనీ రిప్లై ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ డెవలప్‌మెంట్‌ని పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo మొదటగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ కొంతమంది బీటా టెస్టర్‌ల వద్ద అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో కంపెనీ ఈ అప్‌డేట్‌ని అందరి కోసం అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.


ప్రస్తుతానికి వాట్సాప్ యాప్‌లో చాట్ సమయంలో ఫోటో, వీడియో లేదా జిఫ్‌ని ఓపెన్ చేసినప్పుడు, అందులో రిప్లై ఆప్షన్ ఉండదు. అంటే మీరు వేరొకరి నుంచి పంపిన ఫోటో లేదా వీడియోకు రిప్లై ఇవ్వాలనుకుంటే మీరు దానికి రియాక్ట్ అవ్వాలి లేదా ఫోటోను స్వైప్ చేయడం ద్వారా రిప్లై ఇవ్వాలి.


ప్రస్తుతం కంటెంట్‌ను తెరిచేటప్పుడు ఈ ఆప్షన్ అందుబాటులో లేదు. అయితే ఫోటో లేదా వీడియోని ఓపెన్ చేసిన వెంటనే మీకు రిప్లై ఆప్షన్ వస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది. అలాగే ఛాటింగ్ అనుభవాన్ని మరింత సరదాగా చేస్తుంది.


వాట్సాప్ అన్ని అప్‌డేట్‌లను పొందడంలో మీరు కూడా మొదటి వ్యక్తి కావాలనుకుంటే, కంపెనీ బీటా ప్రోగ్రామ్‌కు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో పాటు వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లపై కూడా పనిచేస్తోంది. రాబోయే కాలంలో మీరు వాట్సాప్ స్టేటస్‌ను 24 గంటల కంటే సేపు ఉండేలా సెట్ చేసే ఆప్షన్ పొందుతారు. రెండు వారాల వరకు స్టేటస్ పెట్టే ఫీచర్ ఇందులో అందుబాటులోకి రానుందన్న మాట.


మరోవైపు హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ 90 5జీ పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉండనుంది. ఫోన్ వెనక వైపు 200 మెగాపిక్సెల్, ముందు వైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను అందించారు. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.


హానర్ 90 5జీలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.37,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఎర్లీ బర్డ్ సేల్ కింద రూ.29,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial