ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాపే. ఇది మనందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. వాట్సాప్ గ్రూపుల ద్వారా కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు, ఆఫీస్ సభ్యులతో కూడా కనెక్ట్ అయి ఉండవచ్చు. ఆడియో, వీడియో, ఇమేజెస్, టెక్స్ట్ మెసేజెస్ కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫేక్ న్యూస్‌లు కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి.
అయితే వాట్సాప్ కొత్త ఫీచర్‌తో వీటికి చెక్ పెట్టే అవకాశం ఉంది. గ్రూప్‌లో పెట్టే మెసేజ్‌లను అడ్మిన్ డిలీట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అడ్మిన్ ఏదైనా మెసేజ్‌ను గ్రూప్‌లో నుంచి డిలీట్ చేస్తే ఆ మెసేజ్‌ను అడ్మిన్ డిలీట్ చేసినట్లు కనిపిస్తుంది.
వాట్సాప్ బీటా v2.22.17.12 వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపించినట్లు WABetaInfo కథనం ద్వారా తెలిసింది. ఈ ఫీచర్‌ను కొంతమంది టెస్టర్లకు ఇప్పటికే పంపించినట్లు సమాచారం. త్వరలో స్టేబుల్ వెర్షన్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి గ్రూపులో మెసేజ్‌లను డిలీట్ చేసే యాక్సెస్ కేవలం ఆ మెసేజ్ పంపిన వారికి మాత్రమే ఉంది. ఇప్పుడు గ్రూప్ అడ్మిన్లకు కూడా ఆ ఫీచర్‌ను అందిస్తున్నారు. గ్రూప్‌లో ఎవరైనా అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెడితే అడ్మిన్స్ వాటిని డిలీట్ చేయవచ్చన్న మాట.
వాట్సాప్ ఇటీవలే రియాక్షన్స్ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. మొదట్లో కేవలం లైక్, లవ్, లాఫ్, సర్‌ప్రైజ్, శాడ్, థ్యాంక్స్ రియాక్షన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న ఏ ఎమోజీతో అయినా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ను వాట్సాప్ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పరీక్షించడం విశేషం. ఈ సంవత్సరం మేలో వాట్సాప్ రియాక్షన్ ఫీచర్‌ను మెటా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు దాన్ని అప్‌డేట్ చేశారు. మార్క్ జుకర్‌బర్గ్ ఈ పోస్టులో రోబోట్ ఫేస్, ఫ్రెంచ్ ఫ్రైస్, మ్యాన్ సర్ఫింగ్, సన్‌గ్లాసెస్ స్మైలీ, 100 పర్సెంట్ సింబల్, ఫిస్ట్ బంప్ ఎమోజీలు తన ఫేవరెట్ ఎమోజీ అని తెలిపారు.
వాట్సాప్ మరిన్ని కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రూప్ కాల్‌లో ఉన్నప్పుడు స్పెసిఫిక్ పర్సన్స్‌ను మ్యూట్ చేసే ఫీచర్‌ను తెచ్చారు. దీంతోపాటు లాస్ట్ సీన్ స్టేటస్, అబౌట్, ప్రొఫైల్ ఫొటోను కూడా మనం కావాలనుకున్న యూజర్ల నుంచి హైడ్ చేసే ఆప్షన్ వచ్చింది. గ్రూప్ వాయిస్ కాల్స్‌కు కొత్త ఇంటర్‌ఫేస్‌ను అందించిన కొన్ని రోజులకు వాట్సాప్ ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది.
వాట్సాప్ ఇటీవలే చాట్లను ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్‌ను కూడా తీసుకురావడం విశేషం. అయితే దీనికి అవసరమైన ప్రాసెస్ కొంచెం ఎక్కువ సేపు తీసుకుంటుంది. ఆండ్రాయిడ్ డివైస్‌లో ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే పై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం, ఐఫోన్‌లో ఐవోఎస్ 15.5 లేదా అంతకంటే పై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంలు ఈ ఫీచర్‌కు అవసరం.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!