WhatsApp Upcoming Feature: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లను తీసుకువస్తూనే ఉంది. వినియోగదారుల సౌలభ్యం కోసం కంపెనీ మరోసారి కొత్త ఫీచర్‌ను జోడించింది. వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్ వినియోగదారులు ముఖ్యమైన మెసేజ్‌లను మరచిపోనివ్వదు. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా నాలుగు బిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. అంటే 400 కోట్లు అన్నమాట. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ పేరు ‘మెసేజ్ రిమైండర్స్’. ఇది మీరు ఓపెన్ చేయని మెసేజ్‌ల గురించి నోటిఫికేషన్లు ఇస్తుంది.
వాట్సాప్ మెసేజ్ రిమైండర్ ఫీచర్ ఇదే...
మీరు ఇంకా ఓపెన్ చేయని మెసేజ్‌లను వినియోగదారులకు ఈ ఫీచర్ గుర్తు చేస్తుంది. ఇంతకు ముందు ఈ రిమైండర్ ఫీచర్ స్టేటస్ అప్‌డేట్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఈ ఫీచర్ కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కానీ టెస్ట్ చేసిన తర్వాత ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది.
Also Read: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.24.25.29 అప్‌డేట్ బీటాలో మెసేజ్ రిమైండర్స్ ఫీచర్ కనిపించిందని WABetainfo తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఓపెన్ చేయని మెసేజ్‌ల గురించి రిమైండర్లను కూడా పొందుతారు. WABetainfo ఈ కొత్త ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది.
మీరు దానిని ఎలా ఉపయోగించాలి?
ఇప్పుడు మెసేజ్ రిమైండర్‌ల సెట్టింగ్‌లో రిమైండర్ టోగుల్ అందుబాటులో ఉంది. ఈ టోగుల్‌ని ఎనేబుల్ చేయడం వల్ల వాట్సాప్‌లో ఓపెన్ చేయని మెసేజ్‌లు, స్టేటస్ రిమైండర్ మీకు అందుతాయి. ఈ టోగుల్ ఇంతకు ముందు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే ఇది స్టేటస్ రిమైండర్‌ల కోసం మాత్రమే పని చేస్తుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ మెసేజ్‌లు ఓపెన్ చేయడాన్ని మిస్ అవ్వరు.
వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకు వస్తూనే ఉంటుంది. ఇటీవలే వాట్సాప్ తన స్టేటస్ ట్యాబ్‌లో కూడా మార్పులు చేసింది. స్టేటస్ ఓపెన్ చేయకుండానే దానికి సంబంధించిన గ్లింప్స్‌ను చూడవచ్చు.
Also Read: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!