ప్పటికప్పుడు వినియోగదారుల కోసం నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. గ్రూప్ చాట్‌ లో పోల్‌ లను నిర్వహించడానికి వినియోగదారులను అనుమతించేలా వాట్సాప్ పనిచేస్తోంది. ఈ విషయాన్ని WABetaInfo వెల్లడించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. కెమెరా షార్ట్‌ కట్ నావిగేషన్ బార్‌ లో ఈ ఫీచర్ ఉన్నట్లు ఇందులో కనిపిస్తుంది. కమ్యూనిటీలను రూపొందించే వారి కోసం ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది.

  


మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ ఫామ్ WhatsApp చాట్‌ లో పోల్‌ లను సృష్టించడానికి వినియోగదారులను అనుమతించే కొత్త అప్‌ డేట్‌ పై చాలా కాలంగా పని చేస్తుందని WABetaInfo వెల్లడించింది.  అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ తో, గ్రూప్ పార్టిసిపెంట్‌ లు గ్రూప్‌ లోని ఇతర సభ్యులతో పోల్‌లను షేర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే గరిష్టంగా 12 ఆప్షన్లను మాత్రమే యాడ్ చేసే అవకాశం ఉంది. అయితే, ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే సరికి ఈ సంఖ్యలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.   


ఈ ఫీచర్ ఇంకా డెవలపింగ్ లో ఉన్న నేపథ్యంలో బీటా టెస్టర్‌ లకు విడుదల చేయలేదు. WABetaInfo నివేదిక ప్రకారం ఈ ఫీచర్ కోసం ఎంట్రీ పాయింట్ సాధారణ చాట్ యాక్షన్ షీట్‌ లో అందుబాటులో ఉంటుంది. ఇది Android 2.22.10.11 కోసం WhatsApp బీటా అభివృద్ధి సమయంలో గుర్తించినట్లు వెల్లడించింది.  ఐఫోన్ వినియోగదారుల కోసం వారి యాప్‌ లో కొత్త కెమెరా షార్ట్‌ కట్‌ ను జోడించే ఫీచర్‌ పై వాట్సాప్ పని చేస్తోందని వెల్లడించింది.  కెమెరా షార్ట్‌ కట్ నావిగేషన్ బార్‌ లోని చూపించినట్లుగా ఫీచర్ ఉంటుందని  WABetaInfo  స్క్రీన్‌ షాట్ లో చూపించింది. ప్రస్తుతం కమ్యూనిటీని రూపొందించిన వారితో పాటు భవిష్యత్తులో కమ్యూనిటీని సృష్టించగల వినియోగదారుల కోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలిపింది.


వాస్తవానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ కోసం WhatsApp బీటాలో రిలీజ్ చేసినట్లు తెలుస్తున్నది. కానీ, ఒక బగ్ ఉన్నందున.. తాత్కాలికంగా మరొక అప్ డేకోసం బీటా నుంచి తొలగించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే 90 శాతానికి పైగా టెస్టింగ్ పూర్తి చేసుకున్నా ఈ ఫీచర్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఆయా అంశాలకు సంబంధించి పోల్స్ నిర్వహించుకునే వెసులు బాటు ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావాలని వినియోగదారులు కోరుతున్నారు.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?