WhatsApp Screen Share feature: వాట్సాప్ త్వరలో వీడియో కాల్స్ సమయంలో వినియోగదారులకు స్క్రీన్ షేర్ చేసే ఫీచర్‌ను అందించనుంది. దీని కారణంగా వినియోగదారులు కాల్స్ సమయంలో వ్యక్తులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌కు సంబంధించిన టెస్టింగ్ జరుగుతోంది.


ఇది Android, iOS బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. స్క్రీన్ షేర్ ఫీచర్ ఆన్‌లో ఉన్నప్పుడు, మీరు స్క్రీన్‌పై ఏం చేసినా, వీడియో కాల్‌లో ఉన్న వ్యక్తులందరూ దాన్ని చూడగలరు. వాట్సాప్ నోటిఫికేషన్‌లు కాకుండా, ఇతర అప్‌డేట్‌లు కూడా వినియోగదారులలకు కనిపిస్తాయి. మీకు ఇది అవసరం లేకపోతే దీని కోసం మీరు ఫోన్‌లో ‘do not disturb’  మోడ్‌ను ఆన్ చేయవచ్చు.


ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని మొదట Wabetainfo అందించింది. వీడియో కాల్ సమయంలో దిగువ బార్‌లో వినియోగదారులకు స్క్రీన్ షేర్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ బార్‌లో ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా స్క్రీన్ షేరింగ్‌ను ఉపయోగించవచ్చు.


విండోస్ యూజర్లకు త్వరలో
వాట్సాప్‌లో మిస్డ్ కాల్‌ల కోసం విండోస్ వినియోగదారులకు మెటా 'కాల్ బ్యాక్' అనే ఆప్షన్‌ను ఇవ్వబోతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు కాల్ చేయడానికి వాట్సాప్ పైభాగంలో క్లిక్ చేయనవసరం లేదు. పక్కనే ఉన్న మిస్డ్ కాల్ అనే ఆప్షన్ ద్వారా తిరిగి కాల్ చేయగలరు.


ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా 'ఛానల్' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్రియేటర్స్ ఛానెల్ ఫీచర్‌ను పొందిన వెంటనే, వారు తమ ఫాలోయర్ల కోసం రోజువారీ అప్‌డేట్‌లు పోస్ట్ చేయగలరు. ఇప్పటికే ఉన్న ఫాలోయర్లు ఛానెల్‌లో చేరడానికి నోటిఫికేషన్‌ను పొందుతారు. ఫాలో కానివారు క్రియేటర్ ప్రొఫైల్ లేదా స్టోరీకి వెళ్లి ఛానెల్‌లో చేరాలి. ఛానెల్‌లో క్రియేటర్ మాత్రమే పోస్ట్ చేయగలరు. ఇతర ఛానెల్ సభ్యులందరూ కేవలం అప్‌డేట్స్‌ను మాత్రమే చూడగలరు. పోల్ ప్రశ్నకు రియాక్ట్ అయ్యే ఆప్షన్ కూడా ఫాలోయర్లకు ఉంటుంది.


రాబోయే కాలంలో వాట్సాప్‌లో అనేక కొత్త ఫీచర్లు కూడా రాబోతున్నాయి. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇటీవల తన యాప్‌కి చాట్ లాక్ ఫీచర్, ఎడిట్ బటన్, మల్టీపుల్  వాట్సాప్ ఖాతాను ఉపయోగించడం వంటి మూడు ప్రధాన అప్‌డేట్స్‌ను యాడ్ చేసింది. 


WaBetaInfo నివేదిక ప్రకారం, WhatsApp మీ ఖాతాకు యూజర్ నేమ్‌ను జోడించడానికి అనుమతించే ఒక ఫీచర్‌పై పని చేస్తోంది. దీని ద్వారా ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఫోన్ నంబర్‌ను హైడ్ చేసే ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. దీంతో ఇతర వినియోగదారులందరూ మీ యూజర్ నేమ్‌ను మాత్రమే చూడగలరు.


Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?


వినియోగదారులు తమ ఖాతాలకు అదనపు భద్రతను యాడ్ చేయగలరు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ ఫేజ్‌లో ఉంది. భవిష్యత్ అప్‌డేట్‌లలో మరింత మంది బీటా టెస్టర్‌లకు దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ టెస్టింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది.


Read Also: షావోమీ నుంచి కొత్త టాబ్లెట్ విడుదల, బడ్జెట్ ధరలో హైఎండ్ ఫీచర్స్‌