Whatsapp Undo ‘Delete for me’ Feature: ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకోవడంలో ముందుంటుంది వాట్సాఫ్. మెరుగైన ఛాటింగ్ అనుభవాన్ని పొందడంతో పాటు పొరపాట్లను సవరించుకునేందుకు నయా ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా మరో చక్కటి ఫీచర్ ను పరిచయం చేస్తున్నట్లు వాట్సాప్ తాజా వెల్లడించింది. ఇంతకీ అందేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


వినియోగదారులకు కొత్త ఫీచర్ ను పరిచయం చేసిన వాట్సాప్


వాట్సాప్ లో ఛాటింగ్ చేస్తున్నప్పుడు పొరపాటుగా ఏదైనా మెసేజ్ పంపిస్తే, వెంటనే డిలీట్ ఫర్ ఎవర్రీవన్ అనే ఫీచర్ ద్వారా సదరు మెసేజ్ ను తొలగించే అవకాశం ఉంటుంది. మెసేజ్ పొరపాటుగా పంపించామనే తొందరలో ఒక్కోసారి డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ అనే ఆప్షన్ కు బదులుగా డిలీట్ ఫర్ మీ పైన నొక్కే ప్రమాదం ఉంటుంది. వెంటనే, మెసేజ్ పంపిన వారి ఫోన్ లో ఆ మెసేజ్ డిలీట్ అవుతుంది. అవతలి వ్యక్తి ఫోన్ లో మాత్రం కనిపిస్తుంది. ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతారు. తాజాగా ఈ సమస్యకు పరిష్కారం చూపించింది వాట్సాప్. ఈ మేరకు ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ డూ డిలీట్ ఫర్ మీ(Undo ‘Delete for me’) అనే ఫీచర్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ ఫీచర్ తో డిలీట్ ఫర్ మీ చేసిన మెసేజ్ ను అన్ డూ చేసుకునే అవకాశం ఉంది.


ఇంతకీ ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందంటే?


వాట్సాఫ్ లో పంపిన మెసేజ్ ను డిలీట్ ఫర్ మీ చేసిన వెంటనే, మెసేజ్ డిలీటెడ్ ఫర్ మీ పక్కన అన్ డూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వెంటనే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీరు డిలీట్ చేసిన మెసేజ్ మళ్లీ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకుని డిలీట్ ఫర్ ఎవర్రీవన్ అనే అప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు సదరు మెసేజ్ పూర్తిగా డిలీట్ అవుతుంది. అయితే, అన్ డూ డిలీట్ ఫర్ మీ ఆప్షన్ కేవలం 5 సెకెన్లు మాత్రమే ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది. ఆ టైమ్ లోగానే సదరు మెసేజ్ ను క్లిక్ చేస్తే డిలీట్ చేసిన మెసేజ్ తిరిగి కనిపిస్తుంది. ఈ ఫీచర్ ను యూజర్లు అందరికీ అందుబాటులోకి తెచ్చినట్టు వాట్సాప్ వెల్లడించింది. ఒకవేళ ఎవరికైనా రాకుంటే వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.   






మొత్తంగా తాజా వాట్సాప్ ఫీచర్ తో యూజర్లు పొరపాటున పంపించే మెసేజ్ లను ఎలాంటి ఇబ్బంది లేకుండా డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్ తెలిపింది. యూజర్లకు ఉపయోగపడే మరిన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి  తెచ్చే ప్రయత్నం కొనసాగుతుందని వెల్లడించింది.


Read Also: ఇలా అయితే ఇండియా నుంచి వెళ్లిపోతాం, ఐటీ రూల్స్‌పై వాట్సాప్ తీవ్ర అసహనం