WhatsApp Theme Colour: ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో (WhatsApp Colour Change) వస్తున్న వాట్సాప్ ఇప్పుడు మరోసారి యాప్‌లో మార్పులు చేసింది. ఇప్పటికే ఇంటర్‌ఫేస్ మారిపోగా ప్రస్తుతం కలర్ స్కీమ్‌నీ మార్చేసింది. ఇప్పటి వరకూ బ్లూ థీమ్‌లో ఉన్న వాట్సాప్ ఇప్పుడు గ్రీన్ కలర్‌లోకి మారింది. అయితే...ఈ మార్పుపై యూజర్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బాగుందని అంటుంటే మరి కొందరు గొప్పగా లేదని పెదవి విరుస్తున్నారు. మొన్నటి వరకూ వేరే దేశాల్లోనే కలర్ స్కీమ్ మారగా..ఇప్పుడు ఇండియాలోనూ అందుబాటులోకి వచ్చింది. దీనిపై వాట్సాప్ వివరణ ఇచ్చింది. యూజర్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్టు వెల్లడించింది. లుక్ అండ్ ఫీల్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు స్పష్టం చేసింది. స్పేసింగ్, కలర్స్, ఐకాన్స్ ఇలా అన్ని విధాలుగా మార్పులు చేసినట్టు తెలిపింది.
ఏమేం మార్పులొచ్చాయ్..?
iOSతోపాటు ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనూ ఈ కలర్ స్కీమ్ మారింది. iPhonesలో ఇప్పటి వరకూ బ్లూ కలర్ స్కీమ్ ఉంది. ఇకపై ఇదంతా గ్రీన్ కలర్‌లోకి మారింది. స్టేటస్ బార్, చాట్ లిస్ట్ విండ్ కలర్ థీమ్ మారిపోయింది. అంతే కాదు. వాట్సాప్‌లో షేర్ చేసే లింక్స్ కూడా బ్లూ కలర్‌లో కాకుండా గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు యూజర్స్ ఈ మార్పుల్ని ఎక్స్‌పీరియెన్స్ చేస్తుండగా...ఇంకొందరి ఫోన్‌లలో క్రమంగా అప్‌డేట్ కానుంది. యాండ్రాయిడ్‌లోని డార్క్‌మోడ్‌లోనూ మార్పులు రానున్నాయి. లైట్‌మోడ్‌లోనూ రీడబిలిటీ పెంచేలా మార్పులు చేసింది. కలర్‌తో పాటు మరి కొన్ని మార్పులూ కనిపిస్తున్నాయి. గతంలో ఎవరైనా వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉంటే "online" అని కనిపించేది. కానీ..ఇప్పుడది "Online" గా మారింది. మొదటి అక్షరం క్యాపిటల్‌గా మార్చింది. అదే విధంగా గతంలో ఎవరైనా టైప్ చేస్తుంటే "typing" అని కనిపించేది. ఇప్పుడది "Typing"గా మారింది. ప్రస్తుతం ఈ అప్‌డేట్స్‌పై చర్చ జరుగుతోంది.
కేంద్రంతో ఫైట్..
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్‌పై వాట్సాప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఏవైనా వదంతులు వ్యాప్తి చెందినప్పుడు ఆ సమాచారానికి సంబంధించిన మూలాలు ఎక్కడున్నాయి..? ముందుగా ఎవరు దాన్ని పంపారు..? అనే వివరాలు కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుందన్నది ఆ నిబంధన సారాంశం. అయితే...దీనిపై ఢిల్లీహైకోర్టులో పిటిషన్ దాఖలుగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాట్సాప్ తన వాదనలు వినిపించింది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి రూల్ లేదని స్పష్టం చేసింది. ఓ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే తమ యాప్‌లోని ఎన్‌క్రిప్షన్‌ని బ్రేక్ చేయాలని వివరించింది. అలా చేస్తే వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని వాదించింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వాట్సాప్‌లో మాత్రమే కనిపించే అరుదైన ఫీచర్ అని, దాన్ని బ్రేక్ చేయమంటే ఎలా అని ప్రశ్నించింది. ఇలాంటి నిబంధనలు విధిస్తే భారత్‌లో సేవలు కొనసాగించడం కష్టమే అని అసహనం వ్యక్తం చేసింది.
Also Read: Fact Check: I.N.D.I.A కూటమికి అనుకూలంగా ప్రధాని మోదీ ట్వీట్? అసలు నిజమిదే