AP Pensions Issue :  ఆంధ్రప్రదేస్ ఎన్డీఏ కూటమి నేతలు  చీఫ్ సెక్రటరీ కార్యాలయం ముందు మెరుపు ధర్నా చేశారు. ఒకటో తేదీ దగ్గరకు వస్తున్నందున .. ఆ తేదీన పెన్షన్లను పేదలకు ఇంటికే వెళ్లి ఇవ్వాలని  విజ్ఞప్తి చేస్తూ సీఎస్ ను కలిశారు అన్ని పార్టీల నేతలు. ప్రత్యేకంగా విజ్ఞాపన పత్రం ఇచ్చారు. కానీ చీఫ్ సెక్రటరీ ఒకటో తేదీనే అందరికీ ఇళ్ల వద్ద ఇవ్వడం సాధ్యం కాదని .. గత నెలలో ఇచ్చినట్లుగా  సచివాలయాల దగ్గరే పంపిణీ చేస్తామని చెప్పారు. మూడు రోజుల పాటు పంపిణీ చేస్తాని చెప్పారు. దీంతో ప్రభుత్వ వృద్ధుల పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. సీఎం కార్యాలయం ముంద మెరుపు ధర్నా చేశారు.                                 

  


ఇంటింటికీ పెన్షన్ల పంపిణీపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.   ఇంటింటికీ పంపిణీ కుదరని పక్షంలో.. డీబీటీల రూపంలో చెల్లించాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది.  ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ కుదరదని ఈసీకి   సీఎస్ తెలిపారు.  ఏప్రిల్‌లో చేసినట్లే చేస్తామని వెల్లడించారు. దీంతో తాజాగా   ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎండలో వృద్ధులు పెన్షన్ల కోసం వచ్చి నిరీక్షించి చనిపోతున్నారన్న ఆరోపణలు రావడతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.                            


పెన్షన్లు సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న  ఎన్నికల సంఘం జారీ చేసింది.  ఆ మార్గదర్శకాలను అమలు చేయాలని సీఎస్‌‌కు ఈసీ తెలిపింది.  పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.   ఎక్కడా వలంటీర్లను వాడుకోవద్దని  ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.  ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్న ఎన్నికల కమిషన్.. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే సీఎస్ సానుకూలంగా స్పదించలేదని.. వృద్ధులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.                                          


ఏప్రిల్ నెల పెన్షన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేయడంతో వడ దెబ్బ తగిలి 32 మంది వృద్ధులు చనిపోయా రన్న ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగా ఈ వృద్ధులు చనిపోవడం కలకలానికి రేపింది. అయితే ప్రభుత్వం మాత్రం వారెవరూ పించన్ల కోసం వచ్చి చనిపోలేదని తాజాగా ఈసీకి చెప్పినట్లుగా తెలుస్తోంది.