WhatsApp Group Call: భారతదేశంలో 50 కోట్లకు పైగా ప్రజలు వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌కు రోజూ 200 కోట్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇంతలో కంపెనీ ఐవోఎస్ వినియోగదారులకు ఒక అప్‌డేట్‌ను ఇచ్చింది. అయితే ఈ అప్‌డేట్ కేవలం బీటా టెస్టర్‌ల కోసం మాత్రమే.


ఇప్పుడు ఐవోఎస్ యూజర్లు ఒకేసారి 15 మంది వ్యక్తులతో గ్రూప్ కాల్స్‌ స్టార్ట్ చేయవచ్చు. ముందుగా గ్రూప్ కాల్‌లో కేవలం ఏడుగురిని మాత్రమే యాడ్ చేసుకోవడానికి అనుమతించేవారు. దీని తర్వాత క్రమంగా 32 మంది వరకు ఆ సంఖ్య పెంచవచ్చు.


అంటే ఇంతకుముందు వాట్సాప్ వీడియో కాల్ ఏడుగురితో యాడ్ చేసి క్రమంగా 32 మంది వరకు పెంచుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఒకేసారి 15 మందితో స్టార్ట్ చేయవచ్చన్న మాట. ఈ అప్‌డేట్ గురించిన సమాచారం వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్లను పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo ద్వారా షేర్ చేసింది.


ప్రస్తుతం ఈ అప్‌డేట్ వాట్సాప్ ఐవోఎస్ 23.15.1.70 వెర్షన్‌లో కనిపించింది. క్రమంగా కంపెనీ దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు. ఈ అప్‌డేట్ వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే వ్యక్తులు ఒకేసారి ఎక్కువ మంది వ్యక్తులతో కాల్‌లలో చేరగలరు. దీని వల్ల వారి సమయం ఆదా అవుతుంది. ఐవోఎస్ కాకుండా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా ఈ అప్‌డేట్‌ను తీసుకురానుంది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది.


వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వినియోగదారులకు ఒక వినూత్న యానిమేటెడ్ అవతార్ ఫీచర్‌ను పరిచయం చేయబోతుంది. కొంతకాలం క్రితం కంపెనీ ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం రెండు అద్భుతమైన ఫీచర్లను వెల్లడించింది. ఈ రెండు అప్‌డేట్లు అవతార్‌ల చుట్టూ తిరుగుతాయి.


వీటిలో మొదటి అప్‌గ్రేడ్ వినియోగదారులు వారి స్వంత ఫోటోల సహాయంతో అవతార్‌ను రూపొందించడంలో సహాయపడుతుంది. అంటే మీరు అవతార్‌ను మాన్యువల్‌గా సృష్టించాల్సిన అవసరం లేదు. రెండో అప్‌డేట్ అవతార్ల సేకరణతో వినియోగదారులకు అందిస్తుంది.


వినియోగదారులు ఇప్పుడు వారి ప్రొఫైల్‌ను సెటప్ చేసేటప్పుడు విభిన్న అవతార్‌లను ఎంచుకోవచ్చు. దీంతో వారి ప్రొఫైల్ మెరుగ్గా మారుతుంది. ఈ యాప్ అనుభవం కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది కాకుండా కంపెనీ ప్రజలకు ఇంట్రస్ట్ ఉన్న అనేక ఫీచర్లపై పనిచేస్తోంది. ప్రస్తుతం యూజర్‌నేమ్ ఫీచర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Wabetainfo కథనం ప్రకారం... వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.14.17లో ఛాట్లను ఫిల్టర్ చేసే ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం ఛాట్లను విభాగాల వారీగా సపరేట్ చేసుకోవచ్చు. బిజినెస్, పర్సనల్, అన్‌రీడ్ అనే మూడు ఫిల్టర్లు ప్రస్తుతానికి యాప్‌లో కనిపిస్తున్నాయి. ఈ ఫిల్టర్లను మనం క్రియేట్ చేసుకోవచ్చా, లేకపోతే డీఫాల్ట్‌గా అందులో ఉన్నవే ఉపయోగించుకోవాలా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ వెర్షన్ భవిష్యత్తు అప్‌డేట్లలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial