WhatsApp Status Features: వాట్సాప్ వినియోగదారులకు ఈరోజు రెండు శుభవార్తలు వచ్చాయి. వాట్సాప్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్. ఈ యాప్‌ను పర్సనల్, ప్రొఫెషనల్ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ దాని వినియోగదారులను ఆకర్షించడానికి, ఇతర పోటీదారుల కంటే ముందంజలో ఉండటానికి దాని మెసేజింగ్ యాప్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తూనే ఉంది.
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు
ఈసారి కూడా వాట్సాప్‌లో రెండు కొత్త, చాలా ముఖ్యమైన ఫీచర్లు జోడించారు. ఈ ఫీచర్‌ల ద్వారా యూజర్లు వాట్సాప్ స్టేటస్‌లో ఎవరినైనా ట్యాగ్ చేయవచ్చు. వేరేవాళ్లు పెట్టిన స్టేటస్‌ని మళ్లీ షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో అందుబాటులో ఉంది. వాట్సాప్ స్టేటస్‌లో వచ్చిన ఈ రెండు కొత్త ఫీచర్ల ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ప్రైవేట్ మెన్షన్ ఫీచర్...
వాట్సాప్ స్టేటస్‌లోని ఈ రెండు కొత్త ఫీచర్లలో మొదటి ఫీచర్‌కి ప్రైవేట్ మెన్షన్ అని పేరు పెట్టారు. ఈ ఫీచర్ పేరును బట్టే ఇది మరో యూజర్‌ని మెన్షన్ చేసే సదుపాయాన్ని అందిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ స్టేటస్ లాగా వినియోగదారులు వాట్సాప్ స్టేటస్‌లో కూడా మరో యూజర్‌ని వ్యక్తిని ట్యాగ్ చేయగలుగుతారు. కానీ తమను ట్యాగ్ చేసిన సంగతి... మీరు ట్యాగ్ చేసిన వినియోగదారులకు మాత్రమే కనిపిస్తుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
రీషేర్ ఫీచర్
వాట్సాప్ స్టేటస్‌లోని రెండో కొత్త ఫీచర్ రీషేర్. దీన్ని కూడా పేరు నుంచే అర్థం చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీరు వాట్సాప్‌లో ఎవరైనా ఇతర యూజర్ పోస్ట్ చేసిన స్టేటస్‌ని రీ-షేర్ చేయడం ద్వారా మీ స్టేటస్‌గా ఉంచుకోగలరు. ఈ ఫీచర్ కూడా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండబోతోంది.
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది...
వాట్సాప్ తన అధికారిక బ్లాగ్ ద్వారా ఈ రెండు కొత్త ఫీచర్లను ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ ఈ రెండు కొత్త ఫీచర్లను ఎంపిక చేసిన కొంతమంది బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంచింది. అయితే త్వరలో వీటిని వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే