Vodafone Idea 5G Services: త్వరలో వొడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారులు కూడా 5జీ లాభాలను పొందగలుగుతారు. మార్చి నాటికి దేశంలోని 75 నగరాల్లో 5జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించాలని కంపెనీ అనుకుంటోంది. విశేషమేమిటంటే కంపెనీ తన 5జీ ప్లాన్ ధరను జియో, ఎయిర్‌టెల్ కంటే 15 శాతం వరకు తక్కువగా ఉంచగలదు. దీని కారణంగా ఈ రెండు కంపెనీలు కూడా భవిష్యత్తులో తమ టారిఫ్ ప్లాన్‌లను చవకగా చేయవలసి ఉంటుంది.
వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు ఎక్కడ ప్రారంభం కానున్నాయి?వొడాఫోన్ ఐడియా మొదట ఈ సేవను దేశంలోని 75 ప్రధాన నగరాల్లో 17 సర్కిల్‌లలో ప్రారంభించనుంది. డేటా వినియోగం ఎక్కువగా ఉండే ఈ నగరాల్లోని పారిశ్రామిక హబ్‌లను కంపెనీ లక్ష్యంగా చేసుకుంటుంది. దీని కోసం డీలర్ల కమీషన్‌ను పెంచే అంశాన్ని కూడా వొడాఫోన్ ఐడియా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇతర కంపెనీల నుంచి వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీ ప్రచార ఖర్చులను కూడా పెంచవచ్చు. వొడాఫోన్ ఐడియా తన అమ్మకాలలో 8.4 శాతాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో డీలర్ కమిషన్‌పై ఖర్చు చేసింది. జియో మూడు శాతం, ఎయిర్‌టెల్ నాలుగు శాతం ఆదాయన్ని ఈ విషయాల్లో ఖర్చు చేస్తున్నాయి.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
చవకైన ప్లాన్లతో రానున్న వొడాఫోన్ ఐడియావొడాఫోన్ ఐడియా అక్షయ్ ముంద్రా కొంతకాలం క్రితం మాట్లాడుతూ కంపెనీ 5జీ రీఛార్జ్ ప్లాన్‌లు చవకగా ఉండవచ్చని, లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని సూచించాడు. అయితే ఈ నిర్ణయం వొడాఫోన్ ఐడియా ఆదాయంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కంపెనీ మొదట తగ్గుతున్న వినియోగదారుల సంఖ్యను ఆపాలని, ఆపై ధరల వ్యూహంతో పోటీ పడాలని వారు విశ్వసిస్తున్నారు.
5జీ ఎక్విప్‌మెంట్ ఈ కంపెనీల నుంచే...వొడాఫోన్ ఐడియా ఇటీవల 5జీ నెట్‌వర్క్‌లలో ఉపయోగించే పరికరాల కోసం నోకియా, ఎరిక్సన్, శాంసంగ్‌లతో 3.6 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. వచ్చే మూడు సంవత్సరాల్లో 75,000 5జీ సైట్‌లను ఏర్పాటు చేయాలన్నది కంపెనీ లక్ష్యం.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?