Vodafone Idea Independence Day Offer: భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీన జరుపుకోనుంది. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన అనేక కంపెనీలు ప్రత్యేక ఆఫర్‌లను అందించాయి. వీటిలో టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా కూడా ఒకటి. వొడాఫోన్ ఐడియా తన వినియోగదారుల కోసం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో కొన్ని ప్రత్యేక ప్లాన్‌లను అందించింది.
వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు ఆగస్టు 13వ తేదీ నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. వొడాఫోన్ ఐడియా తన నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఈ ఆఫర్‌లను అందించింది. ఈ ప్లాన్‌ల ధర రూ.1749, రూ.3499, రూ.3624, రూ.3699. ఇవన్నీ వొడాఫోన్ ఐడియా దీర్ఘకాలిక ప్లాన్‌లు. వీటిపై వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది.
రూ. 1749 ప్లాన్ (Vi Rs 1749 Plan)
ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు అంటే పూర్తి ఆరు నెలలు. ఇందులో వినియోగదారులు ప్రతిరోజూ 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ సౌకర్యం పొందుతారు. ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారులు ఈ ప్లాన్‌తో 30 జీబీ అదనపు డేటాను పొందుతారు. ఈ అదనపు డేటా వ్యాలిడిటీ 45 రోజులుగా ఉంది.
రూ. 3499 ప్లాన్ (Vi Rs 3499 Plan)
ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీని ద్వారా వినియోగదారులు ప్రతిరోజూ 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారులు ఈ ప్లాన్‌తో 50 జీబీ అదనపు డేటాను పొందుతారు. ఈ అదనపు డేటా 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
రూ. 3624 ప్లాన్ (Vi Rs 3624 Plan)
ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 365 రోజులుగానే ఉంది. ఇందులో వినియోగదారులు ప్రతిరోజూ 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లను ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారులు ఈ ప్లాన్‌తో కూడా 50 జీబీ అదనపు డేటాను పొందుతారు. ఈ ఎక్స్‌ట్రా డేటా వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌తో వినియోగదారులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా పొందుతారు.
రూ. 3699 ప్లాన్ (Vi Rs 3699 Plan)
ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 365 రోజులే. పై రెండు ప్లాన్ల తరహాలోనే ఇందులో కూడా వొడాఫోన్ ఐడియా కస్టమర్లు ప్రతిరోజూ 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారులు ఈ ప్లాన్‌పై కూడా పై రెండు ప్లాన్ల తరహాలోనే 50 జీబీ అదనపు డేటాను పొందుతారు. ఈ డేటా వ్యాలిడిటీ 90 రోజుల వరకు ఉంటుంది. ఇది కాకుండా యూజర్లు ఈ ప్లాన్‌తో ఒక సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?