Vivo V40e Launch Date: వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. వివో వీ40 సిరీస్‌లో ఇప్పటికే వివో వీ40, వీ40 ప్రో స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. వివో వీ30ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌గా వివో వీ40ఈ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో మార్కెట్లోకి రానుంది. వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.77 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 25వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ మీడియా ఇన్వైట్ ద్వారా అనౌన్స్ చేసింది. దీంతోపాటు వివో ఇండియా వెబ్‌సైట్లో ప్రత్యేకమైన మైక్రో సైట్‌ను కూడా క్రియేట్ చేశారు. ఈ మైక్రోసైట్‌లో దీనికి సంబంధించిన డిజైన్, కీలక స్పెసిఫికేషన్లను చూడవచ్చు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
వివో వీ40ఈ కీలక స్పెసిషికేషన్లు (Vivo V40e Specifications Revealed)
వివో వీ40 స్మార్ట్ ఫోన్ డిజైన్ కాస్త కొత్తగా ఉండనుంది. వివో వీ30ఈతో కంపేర్ చేస్తే ఇందులో కాస్త కొత్త తరహా కెమెరా మాడ్యూల్‌ను అందించనున్నారు. మింట్ గ్రీన్, రాయల్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. 120 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో చూడవచ్చు. హెచ్‌డీఆర్10+ సపోర్ట్, 93.3 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... వివో వీ40ఈలో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్ చూడవచ్చు. ఏఐ ఎరేజర్, ఏఐ ఫొటో ఎన్‌హేన్సర్ ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.
ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని వివో అందించింది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా బరువు 183 గ్రాములుగా ఉండనుంది. దీని ప్రాసెసర్ వివరాలను వివో అధికారికంగా ప్రకటించలేదు. అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీ65 రేటెడ్ బిల్డ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?