Smartphone Comparision: స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో తన కొత్త సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో వీ40 సిరీస్‌ను ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ వివో వీ40, వీ40 ప్రో వంటి రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. అదే సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ నార్డ్ 4కి గట్టి పోటీనిస్తాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య ఎంత తేడా ఉందో తెలుసుకుందాం.


దేని ధర ఎంత ఉంది?
వివో వీ40 స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్‌ల్లో విడుదల అయింది. ఇందులో కంపెనీ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,999గా నిర్ణయించింది. ఇది కాకుండా దాని 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999గానూ, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999గా ఉంచారు.


ఇక వన్‌ప్లస్ నార్డ్ 4 ధర గురించి మాట్లాడినట్లయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు మూడు వేరియంట్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా నిర్ణయించారు. వన్‌ప్లస్ నార్డ్ 4లో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999గానూ, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గానూ ఉంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


దేని ఫీచర్లు బాగున్నాయి?
ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లలో తేడాను పరిశీలిస్తే కంపెనీ వివో వీ40లో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది మాత్రమే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ, 12 జీబీ ర్యామ్‌తో వస్తుంది. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.


వివో వీ40లో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.


ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 6.7 అంగుళాల ప్రో ఎక్స్‌డీఆర్ అమోఎల్ఈడీ, 2772 × 1240 పిక్సెల్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌ని కంపెనీ అందించింది. అలాగే ఈ ఫోన్ 8 జీబీ, 12 జీబీ ర్యామ్‌తో వస్తుంది. అంతేకాకుండా 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.


ఇందులో 8 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించారు. ఇక సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 4లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.


దేని కలర్ ఆప్షన్లు బాగున్నాయి?
వివో వీ40ని కంపెనీ టైటానియం గ్రే, లోటస్ పర్పుల్, గంగా బ్లూ అనే మూడు రంగులలో లాంచ్ చేసింది. మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ 4ను అబ్సిడియన్ మిడ్‌నైట్, ఒయాసిస్ గ్రీన్, మెర్క్యురియల్ సిల్వర్ వంటి మూడు రంగులలో మార్కెట్లో సందడి చేస్తోంది.



Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే