Vivo V30 Pro Launch Date: వివో వీ30 ప్రో స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ రాబోయే కొన్ని వారాల్లో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే వివో వీ30 స్మార్ట్ ఫోన్ కొన్ని మార్కెట్లలో లాంచ్ అయింది. ఇందులో 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుందని కంపెనీ తెలిపింది.


కంపెనీ ల్యాండింగ్ పేజీ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 28వ తేదీన థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ కానుంది. అక్కడ దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభం అయ్యాయి. గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


వివో వీ30 ప్రోకు సంబంధించిన ల్యాండింగ్ పేజీలో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు కూడా రివీల్ అయ్యాయి. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. ఈ ఫోన్ కెమెరా కింద ‘ఆరా’ లైట్ ద్వారా ఫొటోలు తీసేటప్పుడు కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు.


వివరాల ప్రకారం వివో వీ30 ప్రోలో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుందని సమాచారం. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


2023 డిసెంబర్‌లో చైనాలో లాంచ్ అయిన వివో ఎస్18 ప్రో తరహాలోనే దీని ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎస్18 ప్రో పని చేయనుంది.


వివో వీ30 స్మార్ట్ ఫోన్ ఇటీవలే సైలెంట్‌గా గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై వివో వీ30 పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఈ ఫోన్‌ో అందించారు. 3డీ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ స్క్రీన్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. దీంట్లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్ ఉన్న 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. వివో వీ30 పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 2800 నిట్స్‌గా ఉండటం విశేషం.


వివో వీ30లో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ఓవీ50ఈ సెన్సార్‌ను కంపెనీ అందించింది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగా పిక్సెల్ లెన్స్‌ను అందించడం విశేషం. అంటే మూడు 50 మెగా పిక్సెల్ కెమెరాలు ఈ ఫోన్‌లో ఉన్నాయన్న మాట.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?