Oorvasivo Rakshasivo Today Episode దుర్గకి అయిష్టంగానే రక్షిత వాయినం ఇస్తుంది. దుర్గ థ్యాంక్స్ చెప్పి వెళ్తుంది. తను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అని దుర్గతో ధీరు అంటాడు. ఇక నీ పెళ్లి కబురు ఎప్పుడు చెప్తావ్ అని ధీరు దుర్గని అడుగుతాడు. దానికి దుర్గ మంచి అబ్బాయిని చూడు అని అంటుంది. 


ధీరు: అంటే నేను మంచి అబ్బాయిని కానా..
దుర్గ: ఏమో నాకేం తెలుసు. నా కంటే ముందు నువ్వు ఎంత మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావో. ఏంటి అంతలా షాక్ అయ్యావ్ నేను జస్ట్ జోక్ చేశాను. కొంపతీసి నిజంగా అలా ఏమైనా చేశావా ఏంటి.
ధీరు: నా ఫేస్ చూస్తే అలా అనిపిస్తుందా నీకు. ఇంకా నన్ను ఆటపట్టించింది చాలు. నువ్వు మా ఇంట్లో అందరికీ నచ్చావ్.
దుర్గ: ఒక్క మీ అమ్మకి తప్ప.
ధీరు: అమ్మని ఒప్పించడం మ్యాటర్ కాదు. నేను అంటే వాళ్లకి పిచ్చి ప్రేమ అంతకు మించి నాకు ఏమవుతుందా అని భయం. అందుకే కొంచెం అలా ఉంటుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్తే చాలు ఒకే అంటుంది. ఇంతకీ నువ్వు ఏం అంటావ్. 
దుర్గ: నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు ధీరు. నాకు నా లైఫ్ గురించి నేను సాధించాల్సిన వాటి గురించి క్లారిటీ వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను. 
ధీరు: ఓకే వెయిట్ చేస్తాను. ఈలోపు నీ మనసులో ఎవరూ రాకుండా చూడు.
దుర్గ: నామనసులో ఎవరికీ చోటు ఉండదు. 
ధీరు: నా మనసులో నువ్వే ఉంటావ్. ఈ ఇంటికి నువ్వే కోడలిగా వస్తావ్.
దుర్గ: మనసులో.. అది జరగని పని ధీరు. వెళ్లొస్తాను..
విజయేంద్ర: ఏంటి బ్రో లవ్వా.. పిన్ని వాళ్లకి చెప్పొచ్చుగా.
ధీరు: దానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయకతప్పదు. నీ సంగతి ఏంటి బ్రో ఎంత మంది గర్ల్‌ ఫ్రెండ్స్ ఉన్నారు. 
విజయేంద్ర: నో బ్రో నా జీవితంలో ఒక్క అమ్మాయే ఉంది. నేను లవ్ చేసింది ఒక్క వైష్ణవినే. తనకి తప్ప నా లైఫ్‌లో ఇంకెవరికీ చోటు లేదు. నేను తననే పెళ్లిచేసుకుంటా.
ధీరు: అది జరగదు బ్రో. అంటే నా ఉద్దేశం తను ఎక్కడుందో తెలీదు కదా అందుకే..
విజయేంద్ర: నాకు తనమీద ప్రేమ ఉంది. మా ప్రేమే మమల్ని కలుపుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది.
ధీరు: గ్రేట్ లవర్‌వి అనిపించుకున్నావ్ బ్రో. ట్రై చెయ్ తప్పులేదుగా.


దుర్గ ఇంటికి వచ్చాక విజయేంద్రని తలచుకొని కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటుంది. ఇంతలో మళ్లీ అన్నీ గుర్తొచ్చి ఏడుస్తూ పెట్టుకోకుండా వెళ్లిపోతుంది. విజయేంద్రని నిజమైన ప్రేమా అని అనుకుంటుంది. తన ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు రిప్లే ఇవ్వలేదని అమెరికా నుంచి రాలేదని నిందిస్తుంది. ఇక తన తండ్రికి విజయేంద్ర ఇండియా వచ్చాడని చెప్తుంది.


దుర్గ: నేను దుర్గ రూపంలో ఉన్నాను కాబట్టి నేనే వైష్ణవి అని గుర్తుపట్టలేకపోయాడు. రక్షిత ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అన్నీ నన్ను విజయేంద్రని లింక్ చేస్తున్నట్లు జరిగాయి నాన్న.
దయాసాగర్: తనతో మాట్లాడావా..
దుర్గ: తన ముందు ఉన్నది నేను అని తెలియకపోయినా నా మీద చాలా ప్రేమ ఉన్నట్లు చెప్పాడు. వైష్ణవి కోసమే ఇండియా వచ్చాడంట. మా జీవితాలు అన్నీ నాశనం అయిపోయిన తర్వాత వస్తే ఏం లాభం నాన్న. ధీరు లానే విజయేంద్ర కూడా అబద్దాలు ఆడుతున్నాడు.
దయాసాగర్: నువ్వు తనని తప్పుగా ఏమైనా అర్థం చేసుకుంటున్నావేమో.. వైష్ణవి మీద తనకు ప్రేమ ఉందని నాకు అనిపిస్తుంది. విజయేంద్ర ధీరు లాంటి వాడు అయితే దుర్గ దగ్గర దుర్గను పొగుడుతాడు కానీ వైష్ణవిని ఎందుకు గుర్తుచేసుకుంటాడు. 
దుర్గ: నేను ఇప్పుడు ఎవర్ని నమ్మే స్థితిలో లేను నాన్న. 
దయాసాగర్: ఆవేశంలో అపార్థం చేసుకోకు తల్లీ. 


మరోవైపు ధీరు దుర్గకు ఫోన్ చేస్తాడు. సేఫ్‌గా వెళ్లావా అంటూ మాట్లాడుతాడు. నిన్ను పెళ్లి చేసుకునే వాడు అదృష్టవంతుడు అని అంటాడు. అది నేనే కావాలి అని అంటాడు. దానికి దుర్గ చంపేస్తా అంటుంది. నీ చేతుల్లో చావడం కూడా బాగుంటుంది అంటాడు ధీరు. దీంతో దుర్గ నిజమా త్వరలోనే నీ కోరిక నెరవేరుస్తాను అంటాడు. మరోవైపు జయ వాళ్లు వెళ్లిపోతామని అంటే తన అత్తయ్య కలిసే ఉందామని అంటుంది. దీంతో జయ ఓకే అంటుంది. ఇక విజయేంద్ర అమ్మవారి దగ్గరకు వెళ్లి వైష్ణవి తనని క్షమించి తన ప్రేమను అర్థం చేసుకునేలా నువ్వే చేయాలి అని కోరుకుంటాడు. మరోవైపు ధీరు రేష్మకి కాల్ చేస్తాడు. 


ధీరు: హాయ్ రేష్మా ఆంటీ నాకు ఓ డౌట్ వచ్చింది అంటీ అది మీరు అయితేనే క్లారిటీ ఇస్తారని మీకు కాల్ చేశా.. 
రేష్మా: ఏంటి ధీరు అది. 
ధీరు: అంటే ఎప్పటిలా మిమల్ని ఆంటీ అని పిలవాలా లేకపోతే పిన్ని అని పిలవాలా..
రేష్మా: అదేంటి ధీరు కొత్తగా ఇలా మాట్లాడుతున్నావ్.
ధీరు: అంటే మీరు మా నాన్నకి తాళి కట్టని భార్య కదా అందుకే. ఏంటి షాక్ అయ్యావా. నీకు మా నాన్నకి మధ్య ఉన్న రిలేషన్ నాకు తెలిసిపోయింది. అంతేకదా.. కంగారు పడకు పిన్ని. నేను చెప్పినట్లు చేస్తే మా అమ్మకి మీ రిలేషన్‌ గురించి చెప్పను. చెప్తే మిమల్ని వెంటనే చంపేస్తుంది. మా నాన్నకి రెండో ఇళ్లు ఉండదు.
రేష్మా: ఏం చేయాలి ధీరు.
ధీరు: నాకు తెలుసు మీరు ఈ మాట అంటారని. 
రేష్మా: ధీరు మీ నాన్న గారు వస్తున్నారు నేను తర్వాత చేస్తా.
ధీరు: నేను చేసిందే అక్కడికి మా నాన్న వస్తున్నారు అని చెప్పడానికి. నేను చెప్పేది జాగ్రత్తగా విను.. అంటూ ధీరు ఏదో సీక్రెట్‌గా చెప్తాడు. మా నాన్నకి నీ స్టైల్‌లో మాటల్లో పెట్టి దుర్గకి నాకు పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పు ఒప్పించు. నాకు నిజం తెలిసింది అనే విషయం మా నాన్నకు చెప్పినా నాకేం భయం లేదు. 
రేష్మా: ధీరు నేను మళ్లీ కాల్ చేస్తా మీ నాన్న గారు వచ్చేశారు. 
పురుషోత్తం: ఏంటి రేష్మా కంగారుగా ఉన్నావు. ఏమైంది. 
రేష్మా: ఏం లేదు పురు నేను నార్మల్‌గానే ఉన్నాను. 
పురుషోత్తం: ధీరు మీద నీ మీద రక్షిత అరుస్తూనే ఉంటుందా.. పురు నువ్వేం అనుకోను అంటే ఒకటి చెప్పనా.. ధీరు దుర్గల పెయిర్ చాలా బాగుంటుంది. తను దయాసాగర్‌కి ఓన్లీ డాటర్ ఇద్దరికీ పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. 
పురుషోత్తం: నీకెందుకు సడెన్‌గా వాళ్లు గుర్తొచ్చారు. ధీరు విషయంలో ఏ నిర్ణయం అయినా రక్షితదే. నాకేం ఇన్వాల్‌మెంట్ ఉండదు. అసలు నువ్వు ఎందుకు కంగారుగా ఉన్నావ్.. నిజం చెప్పు.
పురుషోత్తం: మన రిలేషన్ గురించి ధీరుకి తెలిసింది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్ ఫిబ్రవరి 15th: క్రిష్‌ని మెడ పట్టుకొని గెంటేసిన విశ్వనాథం.. మాధవ్‌, సత్యల పెళ్లి క్యాన్సిల్ చేసేసిన శేఖర్!