Krishna Mukunda Murari Today Episodes: రెండు జంట ప్రదర్శన చూశాక ఎవరు బాగా చేశారని మధు భవానిని అడుగుతాడు. అయితే భవాని అక్కడ ఉండదు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో భవాని గిఫ్ట్ పట్టుకొని వస్తుంది. అందరూ భవాని దగ్గరకు వెళ్తారు. భవాని రెండు జంటకు బాగా చేశారని మెచ్చుకుంటుంది. ఇక భవాని కృష్ణ, మురారిలకు బెస్ట్ కపుల్ అంటూ గిఫ్ట్ ఇస్తుంది. 


నందూ: నాకు తెలుసు కృష్ణ వాళ్లే గెలుస్తారు అని..
భవాని: ఏయ్ తింగరి నువ్వు ఇలాగే తింగరి వేషాలు వేస్తూ మీ ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలి. 
ఆదర్శ్: కంగ్రాట్స్ మురారి.. ముకుంద డిసప్పాయింట్ అయ్యావా.. 
ముకుంద: అలా ఏం లేదు.. మనసులో.. నాకు తెలుసు అత్తయ్యకి అంత తొందరగా నా మీద ఇంప్రెషన్ పోదు. 
భవాని: మీ అందరికీ ఓ సీరియస్ విషయం చెప్పాలి రండి అలా కూర్చొందాం. 
ముకుంద: మనసులో.. మా గురించి ఏమైనా చెప్పబోతున్నారా..
భవాని: రేవతి.. నేను అమెరికా వెళ్తున్నాను. 
రేవతి: ఇంత సడెన్‌గా ఇప్పుడు యూఎస్‌ వెళ్లడం ఏంటి.. 
భవాని: నా ఫ్రెండ్ వరలక్ష్మి ఉంది కదా.. తనకి ఏదో ప్రాబ్లమ్ ఉంది అంటే సాల్వ్ చేయడానికి వెళ్తుంది. రేపే వెళ్తాన్నా..
మురారి: అదేంటి పెద్దమ్మ రేపు అమెరికా వెళ్తూ ఇప్పుడు చెప్తున్నారు.
భవాని: బయల్దేరేది ఈ రోజే.. ఈ విషయం నిన్ననే చెప్తాను అనుకున్నాను కానీ మీ ప్రొగ్రాం డిస్ట్రబ్ అవుతుంది అని చెప్పలేదు. మధు నా రూంలో లగేజ్ తీసుకొని రా.. నాన్న ఆదర్శ్ నువ్వు ఏం చేయాలో చెప్తా అన్నా కదా. నేను అమెరికా నుంచి రావడానికి కొంచెం టైం పడుతుంది. వచ్చాక చెప్తా నువ్వు ఏం చేయాలో అప్పటివరకు నువ్ వెయిట్ చేయ్. మురారి వన్ వీక్‌లో నీ పోస్ట్ నీకు వచ్చేస్తుంది.
మురారి: ఏదో మీరు ఇక తిరిగి రానట్లు అప్పగింతలు చెప్తున్నారు ఏంటి.
భవాని: నేను ఒక్కరోజు లేకపోతేనే ఇంటిని సూపర్ మార్కెట్ చేస్తారు. అలాంటిది నెలరోజులు రాకపోతే ఇంకేం చేస్తారో.. ఏయ్ తింగరి..
కృష్ణ: నాకు ఏం చెప్పొద్దు పెద్దత్తయ్య.. ఏదో నాలుగు అయిదు రోజులు అన్నట్లు నెల రోజులు అని సింపుల్‌గా చెప్తున్నారు.
భవాని: తింగరి ఎంత ఇంపార్టెంట్ కాకపోతే మీ అందర్నివదిలి వెళ్తాను. మీ పెద్దపల్లి ప్రభాకర్ చిన్నాన్నతో మాట్లాడాను. ఆయన వన్ వీక్‌లో వస్తారు. హాస్పిటల్ పనులు చూసుకుంటారు. నువ్వు చూసుకో.. రేవతి ప్రతీ దానికి కంగారు పడకు. ఈ నెల రోజులు నా పోస్ట్ నీది. 
ముకుంద: అత్తయ్య నాకు ఏం చెప్పరా అత్తయ్య.
భవాని: నీకు చెప్పేది ఏముంది ముకుంద నువ్వు మారడం నిజమే కదా.. ఇన్నాళ్లు ఆదర్శ్ కోసం ఎదురు చూడటం నిజమే కదా.. అయితే ఆదర్శ్‌తో హ్యాపీగా ఉండు. నేను చేయాల్సింది అంతా చేశాను కదా ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది నీకు. ఏం చెప్పాలి అన్నా చేయాలి అన్నా అది మీరు మీరు చూసుకోండి. ఏనీవే టేక్ కేర్. రేవతి వెళ్లొస్తాను. 


కృష్ణ భవాని ఇచ్చిన గిఫ్ట్ ముందు పెట్టుకొని కూర్చొంటుంది. మురారి ఎక్కువ ఆలోచించకు అసలే నీది కోడి మెదడు అంటాడు. ఇక గిఫ్ట్ ముకుంద, ఆదర్శ్‌లకు ఇవ్వకుండా మనకు ఎందుకు ఇచ్చారని ఇద్దరూ ఆలోచిస్తారు. ఇంతలో రేవతి వచ్చి కాఫీ ఇస్తుంది. చాలా సంతోషంగా ఉన్నానని రేవతి అంటుంది. 


కృష్ణ: అత్తయ్య నీకు మేం తప్ప ఇంకెవరూ కనిపించరా.. ముకుంద అంత బాగా చేసింది కదా కానీ పెద్దత్తయ్య వాళ్లకి కాకుండా మాకు గిఫ్ట్ ఇచ్చారు. ముకుంద మీద కోపంతో గిఫ్ట్ మాకు ఇచ్చిందని మేం అనుకుంటే మీరు బాగా చేశారు అంటూ అంటారు ఏంటి.
రేవతి: నీ మొహం ముకుంద మీద కోపంతో మీకు గిఫ్ట్ ఎందుకు ఇస్తుంది మీరు బాగా చేశారు కాబట్టే మీకు ఇచ్చింది.
మురారి: అయినా ముకుంద వాళ్లు బాగా చేశారు కదా అమ్మ. 
కృష్ణ: నువ్వు ముంచి భార్యవి కాబట్టే నీకు ఇచ్చింది. 


ఆదర్శ్: ఆ ఫొటో చూసి మళ్లీ ముకుందని అపార్థం చేసుకున్నానా.. ఆ ఫొటో పాతది అయింటుంది. అసలు నేను అంటే ఇష్టం లేకపోతే నాతో ఎందుకు డ్యాన్స్ చేస్తుంది. నేను ముకుందను నమ్ముతున్నాను. కానీ అంతలోనే అపార్థం చేసుకుంటున్నాను. ఇకపై ఏం జరిగినా ముకుంద గురించి నెగిటివ్‌గా ఆలోచించడం మానేయాలి. ముకుంద 
ముకుంద: ఈయన ఏంటి ఇంత ప్రేమగా పిలుస్తున్నారు. మళ్లీ ఏం అంటారో..
ఆదర్శ్‌: ముకుంద ఇలా రా.. ఇందాక మనం నటించినట్లు నేను తాగి వచ్చినా నువ్వే నన్ను అంతే ప్రేమగా చూసుకో. నీ చేతితో నాకు మందు పోసి ఇవ్వవా.
ముకుంద: అయ్యో దేవుడా నేను అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేయాలి అని నా మనసు చంపుకొని ఆదర్శ్‌ స్థానంలో మురారిని ఊహించుకొని నేను ఏదో చేస్తే అందులో ఈయన ప్రేమని వెతుక్కుంటున్నారు. ఇప్పటికే ఒకసారి నాకు దూరం అయ్యారు. ఇప్పుడు ఈ ప్రేమ నిజం కాదని తెలిస్తే ఏమైపోతారో.. ఇష్టం లేకుండానే ముకుంద ఆదర్శ్‌కి మందు పోస్తూ కంపెనీ ఇస్తుంది. 
ఆదర్శ్: ముకుంద మనిద్దరం కశ్మీర్ వెళ్లిపోదాం.
ముకుంద: కశ్మీర్ ఎందుకు.. అత్తయ్య మిమల్ని ఇక్కడే ఉండమన్నారు కదా.. 
ఆదర్శ్: నేను కూడా మనం అమ్మ వచ్చిన తర్వాతే వెళ్దాం అంటున్నాను. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ ఫిబ్రవరి 15th: బోర్డ్ మెంబర్ పదవి పోగొట్టుకున్న సుమన.. తల్లి రక్తం పీల్చేసిన ఉలూచి!