Trinayani Today Episode సుమనకు పాపని తీసుకొని లోపలికెళ్లి పాలు ఇవ్వమంటే మీటింగ్ మిస్ అయిపోతా అని ఒప్పుకోదు. విక్రాంత్ కూడా పాపని తీసుకోమని సీరియస్ అవుతాడు. దీంతో సుమన డ్రస్ పాడవుతుందని ఎత్తుకోను అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇంటి దగ్గర పిల్లలే ఆఫీస్‌లోనా పిల్లలేనా అని అంటుంది. ఇక ఇక్బాల్‌తో పాపని తీసుకెళ్లి కొన్ని పాలు తాగించమని అంటుంది.


నయని: సుమన ఇక చాలు ఇక్బాల్ ఇక్కడికి కాఫీ తీసుకురావడమే ఎక్కువ. ఇప్పుడు పాలు పట్టమని చెప్తావా..
వల్లి: అదేంటమ్మా నీ బిడ్డకు తల్లిపాలు పట్టవా.
హాసిని: ఈవిడ అందం పోతుంది అని బిడ్డ పుట్టినప్పటి నుంచి పాలు ఇవ్వడం లేదు వల్లిగారు.
వల్లి: అందమా పాడా.. బిడ్డకు పాలు ఇచ్చే అదృష్టం లేక కొంత మంది తల్లులు బయట పాలు ఇస్తున్నారు. నీకు పాలు వస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చిన పాపకు పాలు ఇవ్వడం లేదు.
సుమన: నీకెందుకు అంట. నా బిడ్డకు పాలు ఇస్తాను.. నీళ్లు ఇస్తాను.. అది నా ఇష్టం. నాకు ఎవరూ ఏం చెప్పక్కర్లేదు. 


ఇంతలో నయని నేను పాలు పట్టి వస్తాను అని తీసుకెళ్తుంటే సుమన వద్దు అని అడ్డుకుంటుంది. ప్యాకెట్ పాలు ఇస్తాను అంటే నయని పాపను ఇవ్వదు. దీంతో సుమన లాక్కోవడానికి ప్రయత్నిస్తే సుమన చెంప చెల్లుమనిపిస్తుంది నయని. ఇలా లాక్కుంటే పాపకు ఏమైనా అయితే అని నయని అడుగుతుంది.


సుమన: ఉంటే ఉంటుంది లేదంటే పోతుంది మీకేంటి.
విశాల్: సుమన ఆపు.. ఏం మాట్లాడుతున్నావో నీకు అయినా తెలుస్తుందా. నయని పాపను ఇచ్చేసే.. 
తిలోత్తమ: ఇప్పటికే అందరికీ వికారంగా ఉంది..
విక్రాంత్: సుమన పాపని తీసుకో..
వల్లి: ఇప్పుడు కానీ నువ్వు పాపకి నీ పాలు పట్టలేదు అనుకో.
సుమన: ఏం చేస్తారు..
వల్లి: మీ అక్క ఒక్క దెబ్బే కొట్టింది. ఇక్కడున్న ఆడవాళ్లమంతా ఎలా కొడతామో నీకు తెలీదు.. 
వల్లభ: ఏంటి మీ దౌర్జన్యం.
వల్లి: సార్ మీరు మధ్యలో వస్తే బాగుండదు.
తిలోతమ్త: సుమన ఇప్పుడు పాపకి నీ పాలు పెట్టు. అందరూ కలిశారు అంటే నీ డ్రస్ పాడవ్వడం కాదు చిరిగిపోయేలా ఉంది. 
సుమన: ఈ డ్రెస్‌లో పాపకి పాలు ఎలా పట్టాలి.
నయని: పర్వాలేదు మగాళ్లు అంతా బయటకు వెళ్తారు. 
హాసిని: మేం ఉంటాం మీరు వెళ్లండి.
సుమన: పాలు ఇస్తూ అమ్మా అని గట్టిగా అరుస్తుంది. అందరూ షాక్ అయి సుమన ఏమైంది అని అడుగుతారు. దీంతో నయని పాపని తీసుకొని చూస్తుంది.
నయని: పాలు తాగాల్సిన పసి పాప రక్తాన్ని పీల్చేసింది బాబుగారు. 
విశాల్: వాట్.. అందరూ షాక్ అయిపోతారు.
విక్రాంత్: అరె పాప నోటికి రక్తం అంటుకుంది బ్రో.
హాసిని: ఇంకా పళ్లుకూడా రాని పిల్ల అలా ఎలా.. 
వల్లి: పుట్టినప్పటి నుంచి  పాలు ఇచ్చుంటే ఇలా జరిగేది కాదు. 
వల్లభ: చిన్న మరదలు రక్తం తాగింది అంటే ఆ పిల్ల మామూలుది కాదు.
వల్లి: పిల్ల కాదు తల్లి మామూలుది కాదు. డిసిప్లిన్‌ యాక్షన్ తీసుకోవాలి అని మేం నిర్ణయించుకున్నాం. విశాల్ సార్ బోర్డ్ మెంబర్‌గా ఉండటానికి శ్రీమతి సుమన కరెక్ట్ కాదు. 
వల్లభ: మేం అభ్యంతరం చెప్తాం.
హాసిని: నేను కూడా వాళ్ల నిర్ణయాన్నే గౌరవిస్తాను.
నయని: నేను కూడా..
విక్రాంత్: విశాల్ బ్రో కూడా నీకు సపోర్ట్‌గా ఉన్నా ఇక్కడ మెజారిటీ ప్రకారం నువ్వు బోర్డు మెంబర్‌వి కాదు కేవలం ఉలూచి తల్లివి మాత్రమే. నవ్వుల పాలు కాకముందే నీ బిడ్డను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్లిపో. సుమన వెళ్లిపోతుంది. మీటింగ్ కంటిన్యూ అవుతుంది. ఇక ధురందర, పావనాలకు జరిగింది చెప్తారు. ఇక సుమనను విసిగించొద్దు అని విశాల్ విక్రాంత్‌కి చెప్పి సుమనకు రెస్ట్ తీసుకోమని అంటాడు.


ధురందర: ఇది మరీ బాగుందే ఉదయం నుంచి ఉలూచి పాపను చూసుకుంటున్న మమల్ని ఎవరూ పట్టించుకోరు కానీ తలబిరుసు వారికి తలగడిచ్చి పడుకోమంటున్నారు.
విక్రాంత్: అత్తయ్య పాపని ఇప్పుడే కదా నువ్వు ఎత్తుకున్నావ్. నేను ఉలూచిని ఆఫీస్‌కి తీసుకెళ్లాను కదా.. పావనా, ధురందర షాక్ అవుతారు.
నయని: ఆఫీస్ దగ్గర పాపకి పాలు పెడుతుంటే సుమన రక్తం వచ్చేలా తాగింది ఉలూచి. ఇక సుమనకు నయని కషాయం ఇస్తే సుమన విసిరేస్తుంది. 
విక్రాంత్: వద్దు అంటే చెప్పడానికి నోరు ఉందిగా.. 
హాసిని: చిట్టీకి పొగరు ఈ జన్మలో పోదు.
ధురందర: ఒక్కనిమిషం ఉలూచిని ఆఫీస్‌కు తీసుకెళ్లారా..
పావనా: తీసుకెళ్లింది నువ్వా అల్లుడు నా పెళ్లం చేసిన సేవలు మాత్రం మీరు మర్చిపోతారు అన్నమాట. 
విశాల్: మామయ్య ఎందుకు అలా మాట్లాడుతావ్.
పావనా: చిన్నల్లుడు ఆఫీస్‌కు వెళ్లాగానే నేను మా ఆవిడే చంటిదాన్ని ఇప్పటి దాకా ఆడిస్తూ అలిసిపోయాం. 
తిలోత్తమ: ఏమన్నారు ఉలూచిని మీరే ఇంట్లో పెట్టుకున్నారా..
విశాల్: మామయ్య ఎందుకు అలా చెప్పి నవ్వుల పాలు అవుతారు. ఉలూచిని విక్రాంత్ ఆఫీస్‌కు తీసుకొచ్చాడు. పాప ఏడిస్తే నయని పాలు పట్టుకోవాలి అని చూసింది. ఇక సుమన ఒప్పుకోకుండా తను పాలివ్వడానికి వెళ్లి గాయాలపాలయ్యింది.
ధురందర: కథ బాగుంది విశాల్.. పిల్లని మేం ఎత్తుకొని చాకిరి చేస్తే మాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఆఫీస్‌కు తీసుకెళ్లామని అంటారా. అందరూ కన్య్ఫూజ్ అవుతారు. ఇక పావనా తన భార్య మీద ఒట్టు పెట్టి ఉలూచి ఇంట్లోనే ఉందని చెప్తారు. ఇక తిలోత్తమ ఇదంతా గారడి పిల్ల విశాలాక్షి మాయ అంటుంది. అందరూ తిలోత్తమను మాటలు అంటారు. ఇక సుమన నేనే నష్టపోయాను అని నా బోర్డ్ మెంబర్ పదవి పోయింది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ప్రియాంక సింగ్: సర్జరీ తర్వాత ఆ వ్యాధితో బాధపడ్డా - ఏడాది పాటు మంచానికే పరిమితమయ్యాను..