Satyabhama Today Episode కోమాలో ఉన్న మాధవ్‌ని తీసుకొని అమెరికా వెళ్లిపోదాం అని శేఖర్ సునందతో చెప్తాడు. విశ్వనాథం ఒప్పించే ప్రయత్నం చేస్తే తనకు ఏం చెప్పొద్దని శేఖర్ అంటాడు. సత్య రూపంలో అదృష్టం తన ఇంటికి వస్తుంది అనుకుంటే దురదృష్టమే మిగిలింది అని బాధపడతాడు. చాలా నష్టపోయామని ఏడుస్తాడు. ఇక ఎవరు ఏం చెప్పినా అమెరికా వెళ్లిపోతామని అంటాడు.. ఆ రౌడీని ఎదురించడానికి మా వాడిని పణంగా పెట్టలేమని అంటాడు..
విశ్వనాథం: పోనీ కనీసం మాధవ్ కోమాలో నుంచి బయటకు వచ్చేంత వరకు అయినా ఆగరా..
శేఖర్: రేయ్ వాడు కోమా నుంచి వచ్చాక మా మాట వినడురా. మమల్ని అయినా వదులుకుంటాడు కానీ సత్యని వదులుకోడురా. అర్థమైంది కదా మా బాధ. సత్య మా కోడలు అవ్వడం మాకు కూడా ఇష్టమేరా కాకపోతే తన పుట్టింటి సారితో పాటు ఆ రౌడీల తాళుక సమస్యలను కూడా మా ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడు మీలా మేం కూడా ప్రతీరోజు నరకం అనుభవించాల్సి వస్తుందిరా. మాకు అంత ఓపిక లేదురా.. మమల్ని క్షమించండిరా.. రేయ్ సత్యకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి రా..
శాంతమ్మ: శేఖరం ఒక్కసారి ఆలోచించరా..
శేఖర్: సునంద వెళ్దాం పద. డాక్టర్‌తో మాట్లాడి మాధవ్‌ని అమెరికా తీసుకెళ్లొచ్చో లేదో అడుగుదాం పద.
విశ్వనాథం: క్రిష్‌ని చూసి.. ఎందుకు వచ్చావ్ ఎందుకు వచ్చావ్‌రా అది చచ్చిందో లేదో చూద్దాం అని వచ్చావా.. లేక చావకపోతే మరో కత్తిపోటు పొడుద్దాం అని వచ్చావా..అయిపోయిందిరా నీ కారణం వల్ల నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది. కుదిరిన సంబంధం కూడా చెడిపోయింది. నా పరువు పోయింది. మా ఇంట్లో సంతోషం అనేదే లేకుండా పోయింది. జీవచ్ఛవంలా బతుకుతున్నాంరా. చాలా ఇదినీకు చాలా.. సంతోషమేగా.. నువ్వు కోరుకున్నది ఇదేగా.. నీలాంటి రౌడీలకు భయపడి దాన్ని ఆశలను, ఆశయాలను తొక్కేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలి అనుకున్నాను. కానీ దాన్ని నువ్వు చావు బతుకుల దాకా తీసుకొచ్చావు. నిన్ను ప్రేమించలేదని చెప్పిందనే కదా చంపేస్తావా..
క్రిష్: మాస్టార్ సత్యని కత్తితో పొడిచింది నేను కాదు ఆ కాళీగాడు.
విశ్వనాథం: నువ్వు చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు ఇక చాలు బాబు. అసలు నువ్వు నా శిష్యుడివే కాదు కదా అది కూడా అబద్ధమే కదా.
క్రిష్: అది మాత్రమే అబద్దం. సత్య కోసం మీకు దగ్గర అవ్వాలని మీకు అబద్ధం చెప్పాను మాస్టారు.
విశ్వనాథం: నీకు ఓ చెల్లులు ఉంది కదా తనని ఎవరైనా ఇలా చేస్తే చూస్తూ ఊరుకుంటావా.. మీ చెల్లికి ఓ న్యాయం నా కూతురుకి ఓ న్యాయమా.. నువ్వు ఇంకా ఇలాగే నా కూతురు వెంట పడితే నా కుటుంబం మొత్తం విషం తాగి చనిపోతాం. కానీ నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయను. నీలాంటి నీచుడిని..మృగాన్ని నా అల్లుడిగా చేసుకోను.
క్రిష్: మీరు ఆవేశంలో ఉన్నారు మాస్టారు నిజాలు చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేరు. నేను ఏం చెప్పినా నమ్మడం లేదు. నేను మీ శత్రువుని కాదు నన్ను నమ్మండి.
విశ్వనాథం: వద్దు నీ మాయమాటలతో కొత్త నాటకం మొదలు పెట్టొద్దు. వెళ్లు ఇక్కడి నుంచి.
క్రిష్: మాస్టార్ ఒక్క సారి నేను సత్యని చూడాలి.. సత్య నా ప్రాణం. మీ ఎవర్నీ ఇబ్బంది పెట్టను దూరం నుంచి చూసి వెళ్లిపోతాను.
విశ్వనాథం: ఇంకా సత్యని ఏం చూస్తావ్‌రా. నేను చచ్చినా సత్యని చూడనివ్వను. నీ గాలి కూడా సత్యను తాకనివ్వను. అంటూ కాలర్ పట్టుకొని బయటకు తోసేస్తాడు. నువ్వు ఇంకోసారి నా కూతురు ముఖం చూడొద్దు. దాని జీవితంలోకి ఇంకెప్పుడూ రావొద్దు.
హర్ష: సరిపోతుందా నాన్న నా చేతులు కట్టేశారు. మీరు వాడిని వదిలేశారు. చెల్లిని ఈ స్థితికి చేయాల్సిన వాడికి వేయాల్సిన శిక్ష ఇదేనా.. వాడు తప్పు చేశాడు నాన్న.
విశ్వనాథం: తప్పు చేసింది వాడు కాదురా నేను. దాని బతుకు దానికి బతకనివ్వకుండా అడ్డుకున్నాను. పెళ్లి అని కంగారు పెట్టాను. కన్నతండ్రిలా కాకుండా కసాయివాడిలా ప్రవర్తించాను. నామీద గౌరవంతో తలవంచింది. దాని ఫలితం అందరం చూశాం కదా. చావు బతుకుల మధ్య అది యుద్ధం చేస్తుందిరా. చూడరా.. ఇక ఏ విషయంలోనూ సత్యను బాధ పడనివ్వను.
విశాలాక్షి: ఏవండి సత్య కళ్లు తెరవగానే మాధవ్ గురించి అడుగుతుంది. ఏం చెప్పాలి.
విశ్వనాథం: నిజం చెప్పాలి అంతే..
ఇంతలో సత్య కళ్లు తెరుస్తుంది. అందరూ సత్య దగ్గరకు వెళ్తారు. బాబీ పరుగున వచ్చి సత్య కళ్లు తెరిచిందని క్రిష్‌తో చెప్తాడు. క్రిష్ పరుగున వెళ్తాడు. కానీ విశ్వనాథం మాటలు గుర్తుచేసుకొని ఆగిపోతాడు. ఇక సత్య మాధవ్ గురించి అడుగుతుంది.
విశాలాక్షి: మాధవ్‌కి పర్వాలేదు అమ్మా. ట్రీట్మెంట్ జరుగుతుంది.
సత్య: ఒకసారి చూడాలమ్మ.
విశాలాక్షి: ఇప్పుడు కాదు తర్వాత చూద్దవులే. నీకు ఇప్పుడు రెస్ట్ అవసరం.
సత్య: అత్తయ్య గారు మామయ్య గారు ఎక్కడ.. మాధవ్‌కి ప్రమాదం ఏం లేదు కదా.. నేను శేఖర్ అంకుల్ వాళ్ల ఇంటికి వెళ్లకుండా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు అమ్మ. మీరు నా పెళ్లి గురించి పడుతున్న మెంటల్ టార్చర్ చూసి బాధగా అనిపించింది. ఈ పెళ్లి చేసుకోకపోతే అసలేంటి అనిపించింది. నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంటే ఏ గొడవ ఉండదు అనిపించింది. అదే మాట చెప్పాలని మాధవ్ వాళ్ల ఇంటికి వెళ్లాను. మీకు చెప్పకుండా వెళ్లడం తప్పే కానీ జరుగుతున్న అనార్థాలను ఆపడానికి వేరే దారి కనపడలేదు. అందుకే ఎంగేజ్ మెంట్ రింగ్ తీసుకొని మాధవ్ చేతిలో పెట్టాను. కానీ వాళ్లు ఎవ్వరూ నా ఆలోచనల్ని ఒప్పుకోలేదు. మాధవ్ గారి నచ్చచెప్పి నా మనసు మార్చారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకు అండగా నిలబడతాను అన్నారు. మాధవ్ చాలా మంచివారు అమ్మ.
విశాలాక్షి: జరిగినదాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు రెస్ట్ తీసుకోమ్మా.
సత్య: మాధవ్ గారికి ప్రమాదం లేదు అని తెలిశాక మనసు ప్రశాంతంగా ఉందమ్మ. నేను కోలుకోవడం కన్నా తను కోలుకోవడం ముఖ్యం. నానమ్మ పెళ్లి ఆగిపోతుంది అని నువ్వేం కంగారు పడకు. నాకేం కాలేదు కదా ఇక పెళ్లి పనులకు రెడీ అయిపో.
క్రిష్ డాక్టర్ గెటప్‌లో సత్య దగ్గరకు వస్తాడు. సత్య మాట్లాడటం చూసి హ్యాపీగా ఫీలవుతాడు. ఇంతలో సత్యకు దగ్గు వస్తుంది. విశ్వనాథం క్రిష్ డాక్టర్ అనుకొని వచ్చి చూడమంటాడు. క్రిష్ ఏం చేయాలి ఇప్పుడు దొరికిపోతాను అనుకుంటాడు. ఇంతలో నర్సు రాగానే చూడమని చెప్పి క్రిష్ తప్పించుకుంటాడు. సత్యని ఆ పరిస్థితిలో చూసి క్రిష్ బాధపడతాడు. జాగ్రత్తగా చూసుకోమని సిస్టర్‌కి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.