Guppedantha Manasu February 15th Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 15 ఎపిసోడ్)
రిషి తమ దగ్గర కాలేజీని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడని శైలేంద్ర బినామీ మనిషులు నాటకం ఆడతారు. పక్కాగా ఆధారాలు, డాక్యుమెంట్లు ఉండడంతో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోతారు. చివరకు మినిస్టర్ చెప్పినా కానీ వాళ్లు వెనక్కు తగ్గరు. తప్పని పరిస్థితుల్లో బోర్డ్ మెంబర్స్ అందరూ సంతకాలు పెట్టేందుకు సిద్ధమవుతారు. సర్ నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది అనుకుంటుంది మనసులో వసుధార. ఇక వసుధారకి ఎలాంటి ఆప్షన్ లేదు కాలేజీని రాసివ్వడం తప్ప అని ఫిక్సవుతాడు. అందరూ సంతకాలు చేస్తుంటే వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది... కాలేజీని వదులుకోవాల్సి వస్తోందే అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంటాడు.
శైలేంద్ర: ఇది మా తాతగారు స్థాపించిన కాలేజీ, ఇది మా తమ్ముడు రిషి విస్తరించిన కాలేజీ...ఇప్పుడు పరుల పాలైపోతుందని, సంతకం పెట్టడానికి మనసు కూడా రావడం లేదని, చేయి వణికిపోతుందని అతి చేస్తాడు..నా మనుసుని చంపుకుని సంతకం చేస్తాను అంటాడు
వసుధార కోసం కాలేజీ బయట వెయిట్ చేస్తుంటాడు రాజీవ్. అప్పుడే రాజీవ్ బారి నుంచి గతంలో వసుధారను కాపాడిన వ్యక్తి లోపలికి వస్తూ కనిపిస్తాడు. వీడేంటి లోపలకు వెళుతున్నాడు అనుకుంటూ ఆ విషయం శైలేంద్రకి చెప్పాలని కాల్ చేస్తాడు కానీ రాజీవ్ మాటలు వినకుండానే శైలేంద్ర ఫోన్ కట్‌చేస్తాడు.
Also Read: వచ్చాడయ్యో సామి - వసుధార నమ్మకమే నిజమైంది కాలేజ్ సేఫ్!
బోర్డ్ మెంబర్స్ సంతకాలు మొత్తం పూర్తవుతాయి. కేవలం వసుధార సంతకం మాత్రమే మిగులుతుంది. కాలేజీని కాపాడలేకపోతున్నందుకు రిషికి మనసులోనే క్షమాపణలు చెబుతుంది వసుధార. కన్నీళ్లతో సంతకం పెట్టడానికి సిద్ధమవుతుంది. అప్పుడే వసుధారను కాపాడిన వ్యక్తి లోపలికి ఎంట్రీ ఇస్తాడు.తనని చూసి సంతకం పెట్టకుండా ఆగిపోతుంది...తను వచ్చి రావడంతోనే రిషి మీకు ఎంత బాకీపడ్డడంటూ శైలేంద్ర బినామీ మనుషుల్ని అడుగుతాడు
శైలేంద్ర బినామి: మీకెందుకు, మీరు ఎవరు . రిషి మాకు కాలేజీ అమ్మేశాడు
రిషి కాలేజీ అమ్మేశాడన్నది అబద్ధం అంటూ వారి నాటకాన్ని బయటపెడతాడు. తనని చూసి శైలేంద్ర అసహనానికి లోనవుతాడు.
శైలేంద్ర: ఎవరండీ మీరు..ప్రతిసారి చివరలో ఎవడో ఒకడు వస్తాడు. ఏదో ఒకటి చేస్తారు. ఇది కాలేజీ అనుకుంటున్నారా ? మార్కెట్ అనుకుంటున్నారా? లాస్ట్ టైమ్ ఇలాగే మురుగన్ వచ్చాడు అంటూ నోరుజారుతాడు..మళ్లీ వెంటనే మాట మారుస్తాడు.
కొత్త వ్యక్తి: సాయం చేస్తానంటే ఎందుకు వద్దంటున్నారు. మీ కాలేజీ పరుల పాలు కావాలని మీరే కోరుకుంటున్నారా
శైలేంద్ర: మీలాంటి వాళ్లను నమ్మడానికి వీలు లేదు. మాకు ఎవరి సహాయం అక్కరలేదు
కొత్త వ్యక్తి: రిషి మీకు ఎంత ఇవ్వాలి
శైలేంద్ర బినామి: కాలేజీ తమ పేరున రాయించుకోవడానికి ప్లాన్ వేసిన వాళ్లు... డబ్బులను వద్దంటారు.
శైలేంద్ర: డబ్బులు అంటే ఐదు, పది లక్షలు కాదని, నలభై కోట్లు అని వెటకారంగా అంటాడు
కొత్త వ్యక్తి: యాభై కోట్లు ఇస్తా మీకు ఏమైనా ప్రాబ్లెమా అని అతడు అనడంతో అందరూ షాకవుతారు. అన్నట్లుగానే చెక్ రాసి శైలేంద్ర బినామీ మనుషులకు ఇస్తాడు. ఇంకోసారి కాలేజీవైపుకు రావొద్దని వార్నింగ్ ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపిచేస్తాడు.
Also Read: ఫిబ్రవరి 16 శుక్రవారం రథ సప్తమి - ఈ నియమాలు పాటించండి!
తమకు పరిచయంలేని వ్యక్తి అంత డబ్బు ఇవ్వడంతో వసుధార, మహేంద్రతో పాటు అక్కడున్న వారందరూ షాకవుతారు. అసలు మేము మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకోవాలి, రేపు మీరు కూడా ఎగ్జామ్స్ టైమ్‌లో వచ్చి గొడవ చేయరని గ్యారెంటీ ఏంటి అతడిని అడుగుతుంది వసుధార. నాకు ఆ అవసరం లేదని, నా గురించి ఆలోచించాల్సిన పని లేదని వసుధారతో అంటాడు . మీ కాలేజీని మీరు జాగ్రత్తగా నడుపుకోవచ్చని చెబుతాడు.
వసుధార: అసలు మీరు ఎందుకు మాకు సహాయం చేశారు. ఎందుకు డబ్బు ఇచ్చారు
కొత్తవ్యక్తి: మీ క్యాబిన్‌లో మాట్లాడుకుందాం
మినిస్టర్: తను ఎవరైనా ఓ మంచి పని చేశాడు...కాలేజీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్లిపోతాడు.
తన ప్లాన్ ఫెయిల్ కావడంతో శైలేంద్ర కూడా కోపంగా బోర్డ్ మీటింగ్ రూమ్ నుంచి వెళ్లిపోతాడు.
కొత్తవ్యక్తి-వసుధార
తమకు సాయం చేసిన కొత్త వ్యక్తిని క్యాబిన్‌లోకి తీసుకెళుతుంది వసుధార. అసలు ఎవరు మీరు అని అడుగుతుంది. సాటి మనిషిని అని అతడు బదులు ఇస్తాడు. కష్టాల్లో ఉన్న మిమ్మల్ని అదుకున్నాను. అంతే అంతకుమించి ఏం లేదని బదులిస్తాడు. నేను మీకు డబ్బులు అప్పు ఇచ్చానని అనుకొండి. దానికి వడ్డీ కూడా అవసరంలేదు. ఎప్పుడు వీలైతే అప్పుడు ఇవ్వండి. నేను మిమ్మల్ని డబ్బులుగానీ, కాలేజీ గానీ అడగనని హామీ ఇస్తాడు. తన మాటలు చాటుగా విని శైలేంద్ర షాకవుతాడు.తన దగ్గర కాలేజీ కాలేజీ డాక్యుమెంట్స్ ఉండటంతో వసుధార అనుమానపడుతుంది. తాను సమస్యను సాల్వ్ చేసే వ్యక్తినే కానీ...సమస్యలను సృష్టించేవాడిని కాదని హామీ ఇస్తాడు. ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గరే పెట్టుకొండి అని ఇచ్చేస్తాడు. కానీ తాను ఎవరన్నది ఎంత అడిగినా మాత్రం అతడు సమాధానం ఇవ్వడు. ఈ సాయం ఎందుకు చేస్తావని అడిగినా ఆన్సర్ చెప్పకుండా దాటేసి వెళ్లిపోతాడు. సమయం వచ్చినప్పుడు ఎందుకు చేశానన్నది మీకే తెలుస్తుందంటాడు. వసుధార చేతికి ఉన్న బ్రేస్‌లేట్ గురించి అడుగుతాడు. ఇది రిషి బ్రేస్‌లేట్ అని ... రిషి అంటే నా భర్త, నేను ఏ కష్టంలో ఉన్న ఆయనే నన్ను కాపాడేవాడు అని వసుధార సమాధానం చెబుతుంది. ఇప్పుడు కూడా రిషి నన్ను పంపించి మిమ్మల్ని కాపాడాడు అనుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్లబోతూ తన పేరు మను అని చెబుతాడు. నా దగ్గర మీ కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయని నేనే మీతో టచ్‌లో ఉంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Also Read: ఈ రాశులవారు కొత్త బాధ్యతలు తీసుకునేందుకు రెడీగా ఉండాలి, ఫిబ్రవరి 15 రాశిఫలాలు
అనుపమ -పెద్దమ్మ
అప్పుడే అనుపమకు ఆమె పెద్దమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే మను ఇక్కడికి ఎందుకొచ్చాడని అనుపమ ఆమెపై ఫైర్ అవుతుంది. విలన్స్ హీరోయిన్‌ను ఏడిపిస్తుంటే హీరో రాకుండా ఎందుకు ఉంటాడని అనుపమకు సమాధానం చెబుతుంది పెద్దమ్మ. మను ఎందుకు వచ్చాడో నన్ను అడగటం కంటే వాడినే అడిగితే సరిపోయేదిగా అని అంటుంది. వాడిని అడగలేకే నేను నిన్ను అడుగుతున్నాను అంటుంది. వాడికి సమస్య గురించి చెప్పి నువ్వే ఇక్కడికి పంపించి ఉంటావని పెద్దమ్మపై అనుపమ కోప్పడుతుంది. కాలేజీ సమస్య గురించి నీకు చెప్పి పెద్ద తప్పు చేశానని పెద్దమ్మతో అంటుంది అనుపమ. ఎలాగైతేనేం సమస్య తీరింది కదా అని పెద్దమ్మ అనుపమకు సర్ధిచెప్పబోతుంది. సమస్య తీరడం కాదు...అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. అది నువ్వే క్రియేట్ చేశావని కోపంగా అనుపమ ఫోన్ కట్ చేస్తుంది.
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...