Vivo V29e Price Drop: వివో వీ29ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ మనదేశంలో తగ్గించింది. వివో వీ29 సిరీస్‌లో వీ29ఈ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను వివో వీ29ఈ సపోర్ట్ చేయనుంది.
వివో వీ29ఈ ధర, డిస్కౌంట్ వివరాలు (Vivo V29e Price)
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.26,999 కాగా, ఇప్పుడు రూ.25,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999 నుంచి రూ.27,999కు తగ్గింది. ఆర్టిస్టిక్ బ్లూ, ఆర్టిస్టిక్ రెడ్ కలర్ ఆప్షన్లలో వివో వీ29ఈ కొనుగోలు చేయవచ్చు. వివో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
వివో వీ29ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్‌గా ఉండనుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై వివో వీ29ఈ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా వివో వీ29ఈ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ వంటి ఫీచర్లను ఈ ఫోన్‌లో అందించారు. దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా, బరువు 180.5 గ్రాములుగా ఉండటం విశేషం.
మరోవైపు వివో వీ30 ప్రో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ రాబోయే కొన్ని వారాల్లో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. వివో వీ30 స్మార్ట్ ఫోన్ కొన్ని మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుందని వివో తెలిపింది. వివో వీ30 ప్రోకు సంబంధించిన ల్యాండింగ్ పేజీలో కొన్ని స్పెసిఫికేషన్లు కూడా రివీల్ అయ్యాయి. ఈ ఫోన్‌లో వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?