Vi Rs 26 Recharge Plan: కొన్ని రోజుల క్రితం దేశంలోని మూడు ప్రధాన టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా తమ ప్లాన్ల ధరలను భారీగా పెంచేశాయి. మూడు కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను దాదాపు 25 శాతం వరకు పెంచాయి. ఇప్పుడు తాజాగా వొడాఫోన్ ఐడియా (Vi) తన కస్టమర్ల కోసం కొత్తగా రూ. 26 డేటా వోచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ వోచర్ ఇప్పటికే అదే ధరకు అందుబాటులో ఉన్న ఎయిర్‌టెల్ వోచర్ తరహాలో ఉంటుంది. దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన వొడాఫోన్ ఐడియా... దాని వినియోగదారులకు 1.5 జీబీ అదనపు డేటాను అందిస్తుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
ఈ ప్లాన్ ఒక రోజు వ్యాలిడిటీతో వస్తుంది. అంటే మీరు ఏ రోజు రీఛార్జ్ చేస్తే ఆరోజు ముగియనగానే ప్లాన్ గడువు కూడా ముగుస్తుందన్న మాట. ఇది డేటా వోచర్ అయినందున కాలింగ్, ఎస్ఎంఎస్ లేదా ఇతర ప్రయోజనాలను అందించదు. రోజువారీ డేటా అయిపోయిన వెంటనే అదనపు డేటా అవసరమయ్యే కస్టమర్‌లకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రెండింటికి సంబంధించిన రూ.26 ప్లాన్ బెనిఫిట్స్ ఒకేలా ఉంటాయి. ఇది డేటాను పెంచడానికి ఉపయోగించవచ్చు. కానీ ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేయడానికి యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండటం అవసరం. మీ నంబర్‌పై యాక్టివ్ ప్లాన్ లేకపోతే ఈ వోచర్‌ని ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉండదు. అంటే రోజువారీ డేటా అయిపోయిన తర్వాత అదనపు డేటా అవసరమైన వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
మీరు వొడాఫోన్ ఐడియా కస్టమర్ అయి మీ రోజువారీ డేటా అయిపోయినట్లయితే మీరు ఈ ప్లాన్ నుంచి 1.5 జీబీ అదనపు డేటాను పొందవచ్చు. ఇది కాకుండా 1 జీబీ అదనపు డేటా కోసం 22 రూపాయల మరో వోచర్ కూడా అందుబాటులో ఉంది. వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్ కంపెనీ వెబ్‌సైట్, యాప్‌లో అందుబాటులో ఉంది. అక్కడి నుంచి సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే