వూ గ్లో ఎల్ఈడీ టీవీ సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో వచ్చిన ఈ టీవీల్లో ‘గ్లో’ డిస్‌ప్లే ప్యానెల్‌ను అందించారు. గతంలో వచ్చిన ఎల్ఈడీ ప్యానెళ్ల కంటే మెరుగైన టెక్నాలజీతో ఈ డిస్‌ప్లేను కంపెనీ రూపొందించింది.
వూ గ్లో ఎల్ఈడీ టీవీ సిరీస్ ధర
ఇందులో 50 అంగుళాల వేరియంట్ ధర రూ.35,999 కాగా, 55 అంగుళాల మోడల్ ధర రూ.40,999గానూ, 65 అంగుళాల మోడల్ ధర రూ.60,999గానూ నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో వీటి సేల్ జరగనుంది. 43 అంగుళాల వేరియంట్ కూడా భవిష్యత్తులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వూ గ్లో ఎల్ఈడీ టీవీ సిరీస్ స్పెసిఫికేషన్లు
వూ గ్లో సిరీస్ టీవీల్లో ఏఐ గ్లో పిక్చర్ ప్రాసెసర్‌ను అందించారు. 94 శాతం కలర్ గాముట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్10, డాల్బీ విజన్, ఎంఈఎంసీ, యాంబియంట్ లైట్ సెన్సార్ వంటి ఫీచర్లు వీటిలో ఉన్నాయి. వీటిలో క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అందించారు. డ్యూయల్ కోర్ జీపీయూ కూడా ఉంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ యాప్స్ ఇందులో ముందుగానే ఇన్‌స్టాల్ అయి రానున్నాయి. ఇక ఆడియో విషయానికి వస్తే ఈ టీవీలోని స్పీకర్లు ఏకంగా 104W సౌండ్ అవుట్ పుట్‌ను అందించనున్నాయి. డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. డీజే తరహా సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చే సబ్ వూఫర్‌లతో ఈ టీవీలను కంపెనీ ఎక్విప్ చేసింది.
ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్లను ఈ టీవీల్లో అందించారు. దూరం నుంచి కూడా నేరుగా వాయిస్ కమాండ్‌ను అందించవచ్చు. గేమింగ్ కోసం వీఆర్ఆర్, ఏఎల్ఎల్ఎం ఫీచర్లను అందించారు. క్రికెట్ చూడటం కోసం అడ్వాన్స్‌డ్ క్రికెట్ మోడ్‌ను కూడా వూ గ్లో ఎల్ఈడీ సిరీస్ టీవీల్లో అందించారు.
గతంలో వూ మాస్టర్‌పీస్ గ్లో క్యూఎల్ఈడీ టీవీ సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. ఇవి హైఎండ్ లగ్జరీ స్మార్ట్ టీవీలు. వీటిలో 55 అంగుళాల మోడల్ ధరను రూ.74,999గా నిర్ణయించారు. ఇక 65 అంగుళాల మోడల్ ధర రూ.99,999గానూ, 75 అంగుళాల మోడల్ ధర రూ.1,79,999గానూ నిర్ణయించారు. ఈ స్మార్ట్ టీవీలను వూ వెబ్‌సైట్, అమెజాన్‌ల్లో కొనుగోలు చేయవచ్చు.
వీటిలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 4కే క్యూఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించారు. ఈ టీవీల పీక్ బ్రైట్‌నెస్ 800 నిట్స్‌గా ఉంది. 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల స్క్రీన్ సైజుల్లో ఈ టీవీలు కొనుగోలు చేయవచ్చు. వీటిలో అంచులు లేని డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్10+, హెచ్ఎల్‌జీ, డాల్బీ విజన్ ఐక్యూ ఫీచర్ కూడా ఉంది. 4.1 చానెల్ 100W స్పీకర్లు ఇందులో ఉండటం విశేషం. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?