పాపులర్ చైనీస్ కంపెనీ షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీ సిరీస్ లాంచ్ అయింది. షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ పేరుతో త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ సిరీస్ లో మూడు డిస్‌ప్లే వేరియంట్లను వినియోగదారుల ముందుకు షావోమీ తీసుకొచ్చింది. అత్యధునిక టెక్నాలజీతో ఈ డిస్ ప్లేలను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. 4K రెజల్యూషన్ తో 43, 50, 55 ఇంచుల డిస్‌ప్లేలతో ఈ స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. డాల్బీ విజన్, డాల్బీ ఆడియో, హెచ్‌డీఆర్ 10 సపోర్ట్ సహా మంచి స్పెసిఫికేషన్లను ఈ స్మార్ట్ టీవీలు కలిగి ఉన్నాయి. ఈ సిరీస్ లోని టీవీల ధరలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు సహా పలు వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే..
షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్‌లో 4K రెజల్యూషన్ ఉన్న మూడు డిస్‌ప్లే సైజుల్లో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు టీవీలు ఒకే రకమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో వస్తున్నాయి. ఈ టీవీలు MEMC ఇంజిన్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10, HGLకు సపోర్ట్ గా వస్తున్నాయి. ఇవి VPE ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. దీని మూలంగా పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ సిరీస్ టీవీలు ఆక్టాకోర్ ఏ55 ప్రాసెసర్ ను కలిగి ఉంటాయి. 2జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ 10 బేస్డ్ ప్యాచ్ వాల్ గరిష్ఠంగా 30 వాట్ల సౌండ్ ఔట్ పుట్ ను ఇచ్చే రెండు స్పీకర్లు ఈ స్మార్ట్ టీవీల్లో ఉన్నాయి. డాల్బీ ఆడియో, డీటీఎస్ హెచ్‌డీ, డీటీఎస్ వర్చువల్, ఎక్స్ టెక్నాలజీలకు ఈ స్పీకర్లు సపోర్టు చేస్తాయి.
అటు ఈ లేటెస్ట్ ఎక్స్ సిరీస్ టీవీలకు రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉంటాయి. రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక AVI పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో పోర్టు, ఎథెర్ నెట్ పోర్టు లను కలిగి ఉంటాయి. డ్యుయల్ బ్యాండ్ వై ఫై, బ్లూ టూత్ వెర్షన్ 5.0 వైర్ లెస్ కనెక్టివిటీ ఫీచర్లును కలిగి ఉన్నాయి. క్రోమ్ కాస్ట్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీల ధరలు పరిశీలిస్తే..
ఎక్స్ సిరీస్ లో భాగంగా మూడు స్మార్ట్ టీవీలు విడుదల అయ్యాయి. డిస్ ప్లే సైజ్ ను బట్టి ఆయా టీవీల ధరలను నిర్ణయిచినట్లు కంపెనీ తెలిపింది. 43 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ. 28,999 గా ఫిక్స్ చేసింది. 50 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ. 34,999 గా నిర్ణయించింది. 55 ఇంచుల టీవీ ధర రూ. 39,999 గా ఉంటుందని ప్రకటించింది.
సేల్ ఎప్పుడంటే?
షావోమీ కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ తో పాటు ఈ-కామర్స్ సంస్థలు అయిన సైట్ ఫ్లిప్ కార్ట్ లో సెప్టెంబర్ 14 నుంచి అందుబాటులో ఉంటాయి.