శాంసంగ్ మనదేశంలో కొత్త నియో క్యూఎల్ఈడీ 8కే, నియో క్యూఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. ఇవి అల్ట్రా ప్రీమియం రేంజ్‌లో లాంచ్ అయ్యాయి. వీటిలో మూడు 8కే టీవీలు, మూడు 4కే టీవీలు ఉన్నాయి. స్మార్ట్ హోం డివైస్‌లను కంట్రోల్ చేయడానికి దీన్ని బిల్ట్ ఇన్ ఐవోటీ హబ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. 45 ఉచిత ఇండియన్, గ్లోబల్ టీవీ చానెళ్లను శాంసంగ్ టీవీ ప్లస్ సర్వీస్ ద్వారా పొందవచ్చు.ఇవి ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్తో రానున్నాయి. బ్యాటరీ అవసరం లేని ఉచిత సోలార్ రిమోట్‌తో ఈ టీవీ రానుంది.
శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే, నియో క్యూఎల్ఈడీ టీవీ ధర
శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే మూడు టీవీలు ఉన్నాయి. వీటి స్క్రీన్ సైజులు 65 అంగుళాల నుంచి 85 అంగుళాల మధ్య ఉంది. ఈ మోడల్ ధర రూ.3,24,990 నుంచి ప్రారంభం కానుంది.
శాంసంగ్ నియో క్యూఎల్ఈడీలో కూడా మూడు టీవీలు ఉన్నాయి. వీటి స్కీన్ సైజులు 55 అంగుళాల నుంచి 85 అంగుళాల మధ్య ఉన్నాయి. ధర రూ.1,14,900 నుంచి మొదలవనుంది. ఏప్రిల్ 30వ తేదీ లోపు ఈ టీవీలను కొనుగోలు చేస్తే... శాంసంగ్ హెచ్‌డబ్ల్యూ-క్యూ990బీ సౌండ్ బార్, స్లిమ్‌ఫిట్ కెమెరాను ఉచితంగా పొందవచ్చు
శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే, నియో క్యూఎల్ఈడీ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ టీవీల్లో శాంసంగ్ ట్రేడ్ మార్క్ ఇన్‌ఫినిటీ వన్ డిజైన్ చూడవచ్చు. ఇది టీవీకి స్లిమ్ లుక్ అందించింది. పైన చెప్పినట్లు ఇందులో బిల్ట్ ఇన్ ఐవోటీని అందించారు. స్మార్ట్ హోం ఇంటిగ్రేషన్‌కు ఇది ఉపయోగపడనుంది. ఈ టీవీలు ల్యాగ్ లేని స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనున్నాయని కంపెనీ అంటోంది.
శాంసంగ్ న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 8కేను ఈ టీవీలో అందించారు. క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ ప్రో ఫీచర్ కూడా ఉంది. ఐ కంఫర్ట్ మోడ్‌ను కూడా శాంసంగ్ అందించడం విశేషం. వీటిలో 90W 6.2.4 చానెల్ ఆడియో సిస్టంను అందించడం విశేషం. ఇది డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేస్తుంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?