Top countries in mobile usage | స్మార్ట్ ఫోన్ మ‌నిషి జీవితంలో భాగమైపోయింది. ఏ ప‌నిచేయాల‌న్నా స్మార్ట్ ఫోన్ త‌ప్ప‌నిస‌రైంది. విద్య, వినోదం, ఆట‌లు, పాట‌లు, టెక్నాల‌జీ, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, బ్యాంకింగ్, వీడియో కాలింగ్‌.. ఇలా ఏ ప‌ని కావాల‌న్నా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే భ‌య‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు. ఫోన్ చేతిలో లేక‌పోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ క‌లుగుతోంది. మూడు, నాలుగేళ్ల పిల్ల‌లు కూడా స్మార్ట్ ఫోన్‌లో వీడియోలు చూడ‌కుండా ముద్ద ముట్ట‌ని ప‌రిస్థితి తరచుగా చూస్తూనే ఉన్నాం.

  


సినిమాలు చూడాలంటే స్మార్ట్ పోన్ ఉంటే చాలు. హ్యాపీగా కుర్చున్న చోటనే సినిమాలు చూడొచ్చు. కాపీ కూడా చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్క‌ర‌మే జ‌ర్నీ చేస్తున్న‌ప్పుడు బోర్ కొడుతోంద‌ని భ‌యం లేకుండా కూడా ఆన్‌లైన్‌లోనే సినిమాలు ఎంచ‌క్కా చూసేయ‌చ్చు. థియేట‌ర్‌కి పోయి డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేకుండానే అంద‌రూ ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫాంల‌లో బోలెడు సినిమాలు వెబ్ సిరీస్‌లు ఆన్‌లైన్‌లోనే చూసి ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇది అంద‌రికీ సౌక‌ర్య‌వంతంగా కూడా ఉంటోంది. కరోనా తరువాత ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోం, ఆన్ లైన్ ట్రేడింగ్ అంటూ ఎన్నో పనులు మొబైల్లోనూ చేస్తున్నారు.


సర్వేలో ఏం తేలింది.. 
మెక్ గిల్ విశ్వవిద్యాలయం నివేదిక ప్ర‌కారం ప్ర‌పంచంలోనే చైనా స్మార్ట్ ఫోన్ వినియోగంలో మొద‌టి స్థానంలో ఉంది. జాబితాలో సౌదీ అరేబియా 2వ స్థానంలో ఉండగా, మలేషియా మూడో స్థానం, బ్రెజిల్, దక్షిణ కొరియాలు 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాన్, కెనడా, టర్కీ, ఈజిప్ట్ నేపాల్ ఉన్నాయ‌ని మెక్‌గిల్ నివేదిక పేర్కొంది. కా, స్మార్ట్‌ఫోన్ వినియోగం పరంగా మ‌న భారతదేశం జాబితాలో 17వ స్థానంలో నిలిచింది.


ఆన్ లైన్ సేవలు మొత్తం మొబైల్లోనే..  
బ్యాంకు సేవ‌లు.. ప‌లు ర‌కాల బ్యాంకుల సేవ‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే దొర‌కుతున్నాయి. బ్యాంకుల చుట్టూ తిరిగి స‌మ‌యం వృథా అవుతుంద‌న్న టెన్ష‌న్ లేదు. పెన్ను, పేప‌ర్లు ప‌ట్టుకుని తిర‌గాల్సిన ప‌నిలేదు. ఎవ‌ర్నీ అడగాల్సిన అవ‌శ్యం లేదు. అన్నీ చేతిలో ఉన్న స్మార్ట్ పోన్‌తో చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. మ‌రీ అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప మ‌నం బ్యాంకు మెట్లు తొక్కాల్సిన ప‌నిలేకుండా పోతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగంపై మెక్ గిల్ విశ్వవిద్యాలయం ఇటీవల ఒక అధ్యయనం నిర్వ‌హించింది. ఈ జాబితా ప్ర‌కారం స్మార్ట్ పోన్‌కు బానిసైన దేశాల వివ‌రాలు వెల్ల‌డించింది. 


ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరిగిన త‌ర్వాత స్మార్ట్ ఫోన్ వినియోగం మ‌రింత ఎక్కువైంది. ఎంత‌లా అంటే కొంద‌రైతే రోజుకు 15 నుంచి 18 గంట‌లు  కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఉంటున్నారు. అంటే, వారు క‌నీసం నిద్ర కూడా స‌రిగా పోవడం లేదన్న‌మాట‌. స్మార్ట్ ఫోన్‌లో ఉన్న డిజిట‌ల్  వెల్ బీయింగ్ ఆఫ్ష‌న్‌లో చూస్తే వారు రోజుకు ఎంత స‌మయం ఫోన్ వినియోగించారో తెలుస్తుంది. దీంతోపాటు వారు ఏయే యాప్‌ను ఎంత‌సేపు వాడారో కూడా తెలుస్తుంది. ఇన్‌స్టా, ఫేక్ బుక్‌, యూబ్యూబ్‌లో రీల్స్‌కు అల‌వాటు ప‌డి వాటిని చూస్తూ గంట‌లు క‌రిగిపోతుంటే గుర్తించ‌లేని స్థితిలో కొంత‌మంది యువ‌త ఉంటే, మ‌రికొంద‌రు రీల్స్‌ను చూసి వారు కూడా చేయ‌డం అభిమానుల్ని సంపాదించే ప‌నిలో ఉంటున్నారు.  


అదే స్థాయిలో దుష్పరిణామాలు
స్మార్ట్ ఫోన్ ను ఎంత‌వ‌ర‌కు వాడాలో అంతే వాడ‌కుండా దుర్వినియోగం చేస్తే దుష్ప్ర‌భావాలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. ఇటీవ‌ల పోర్న్ కంటెంట్ చూడ‌టానికి, సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ఉండ‌టంతో చిన్న‌పిల్ల‌ల నుంచి పెద్ద‌వారి వ‌ర‌కు పెడ‌దోవ ప‌ట్టి చెడిపోతున్నారు. స‌రైన నిద్ర లేకుండా చీక‌ట్ల‌లోనూ అదేప‌నిగా చూస్తూ కంటి చూపుకు ఎస‌రు పెట్టుకుంటున్నారు. అతిగా సోష‌ల్ మీడియా వాడుతూ పెట్టే పోస్టుల కార‌ణంగా, తెలిసో తెలియ‌కో ఫేక్ న్యూస్‌ను షేర్ చేయ‌డం ద్వారానో స‌మాజంలో, వ్య‌క్తిగ‌తంగా, కుల‌మ‌తాల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.  అందుకే అతి స‌ర్వత్రా వ‌ర్జ‌యేత్ అంటారు పెద్ద‌లు.