Tecno Spark Go 1 Launched: టెక్నో స్పార్క్ గో 1 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. టెక్నో స్పార్క్ సిరీస్‌లో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే. ఈ ఫోన్‌లో నాలుగు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. యూనిసోక్ టీ615 ప్రాసెసర్‌పై టెక్నో స్పార్క్ గో 1 రన్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


టెక్నో స్పార్క్ గో 1 ధర ఎంత? (Tecno Spark Go 1 Price)
ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి టెక్నో అధికారిక వెబ్ సైట్లో దీన్ని లిస్ట్ చేశారు. గ్లిట్టెరీ వైట్, స్టార్‌ట్రయిల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఇది లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ ఎప్పుడు ప్రారంభం కానుందో తెలియరాలేదు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


టెక్నో స్పార్క్ గో 1 స్పెసిఫికేషన్లు (Tecno Spark Go 1 Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో స్పార్క్ గో 1 రన్ కానుంది. ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ముందువైపు హోల్ పంచ్ కటౌట్ అందించారు. డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఫీచర్ ద్వారా నోటిఫికేషన్లను ఫ్రంట్ కెమెరా కటౌట్‌లో చూడవచ్చు. యూనిసోక్ టీ615 చిప్‌సెట్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.


8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ర్యామ్‌ను మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు డ్యూయల్ కెమరా సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. డ్యూయల్ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం టెక్నో స్పార్క్ గో 1 ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


డీటీఎస్ సౌండ్‌ను సపోర్ట్ చేసే డ్యూయల్ స్పీకర్లను టెక్నో స్పార్క్ గో 1లో అందించారు. ఐఆర్ కంట్రోల్ కూడా ఇందులో ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్క భాగంలో అందించారు. టెక్నో స్పార్క్ గో 1లో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ లైఫ్ స్పాన్ నాలుగు సంవత్సరాల వరకు ఉంటుందని కంపెనీ అంటోంది. ఈ ఫోన్ ఫీచర్లను బట్టి చూస్తే రూ.ఏడు వేల లోపు నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. టెక్నో మనదేశంలో ఎన్నో బడ్జెట్ ఫోన్లు లాంచ్ చేసింది. ప్రధానంగా టైర్-2, టైర్-3 నగరాల్లో టెక్నో యూజర్ బేస్ ఎక్కువగా ఉంటుంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?