Tecno Pova 6 Neo 5G Launched: టెక్నో పోవా 6 నియో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. టెక్నో లాంచ్ చేసిన లేటెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే. ఇందులో మూడు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రెండు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


టెక్నో పోవా 6 నియో 5జీ ధర (Tecno Pova 6 Neo 5G Price in India)
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. దీనిపై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ.1,000 అదనపు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభించనున్నాయి. అమెజాన్, కొన్ని రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అరోరా క్లౌడ్, అజూర్ స్కై, మిడ్‌నైట్ షాడో కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


టెక్నో పోవా 6 నియో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Tecno Pova 6 Neo 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైఓఎస్ 14.5 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో పోవా 6 నియో 5జీ రన్ కానుంది. ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 6 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆన్‌బోర్డ్ స్టోరేజ్ నుంచి మరో 8 జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా ఉపయోగించుకోవచ్చు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఐదు సంవత్సరాల పాటు ఈ ఫోన్ ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు ఏఐ ఆధారిత 108 మెగాపిక్సెల్ కెమరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. వెనకవైపు కెమెరాలో సూపర్ నైట్ మోడ్, టైమ్ ల్యాప్స్, వ్లాగ్, డ్యూయల్ వీడియో ఫీచర్లు కూడా ఉన్నాయి.


ఏఐజీసీ పొర్‌ట్రెయిట్, ఏఐ మ్యాజిక్ ఎరేజర్, ఏఐ కటౌట్, ఏఐ వాల్ పేపర్, ఏఐ ఆర్ట్‌బోర్డ్, ఆస్క్ ఏఐ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి. 


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే