ట్యాగ్ కంపెనీ మనదేశంలోకొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది. అదే ట్యాగ్ వెర్వ్ నియో. ఇందులో ఎల్సీడీ డిస్‌ప్లే, జింక్ అలోయ్ బాడీలను అందించారు. బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్, హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. స్లీప్ ట్రాకర్, మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకర్లు కూడా ఇందులో ఉన్నాయి.


ట్యాగ్ వెర్వ్ నియో ధర
దీని ధరను రూ.1,899గా నిర్ణయించారు. బ్లూ, బ్లాక్, రోజ్ గోల్డ్ రంగుల్లో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు. 16 స్ట్రాప్ కలర్ వేరియంట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వాచ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీనికి ఒక సంవత్సరం వారంటీని అందించారు.


ట్యాగ్ వెర్వ్ నియో ఫీచర్లు
ఇందులో 1.69 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 240 x 280 పిక్సెల్స్‌గా ఉంది. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. జింక్ అలోయ్ బాడీని ఇందులో అందించారు. ఇందులో 100కు పైగా వాచ్ ఫేస్‌లను అందించారు.


బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్‌ను మానిటర్ చేసే ఎస్‌పీఓ2 సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ఇందులో స్లీప్ ట్రాకర్, మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకర్ కూడా ఉన్నాయి. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. స్కిప్పింగ్, సైక్లింగ్, ఇండోర్ రన్నింగ్, ఫుట్ బాల్, వాకింగ్, బ్యాడ్మింటన్, యోగా, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, హైకింగ్ వంటి స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.


ఈ స్పోర్ట్స్ మోడ్ ద్వారా మీరు వర్కవుట్ డేటాను రికార్డు చేసుకోవచ్చు. దీంతోపాటు ఎక్సర్‌సైజ్ తర్వాత అనాలసిస్ జనరేట్ చేయడానికి కూడా ఇది సాయపడుతుంది. దీంతోపాటు స్టెప్స్ ట్రాకింగ్, నడిచిన దూరం, కరిగించిన కేలరీలను ట్రాక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.


ఒక్కసారి చార్జ్ పెడితే ఈ స్మార్ట్ వాచ్ 10 రోజుల బ్యాకప్‌ను ఇది అందించనుంది. దీంతోపాటు ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ట్యాగ్ నియో యాప్ కూడా ప్లేస్టోర్, యాప్ స్టోర్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కమింగ్ కాల్స్, మెసేజెస్ వచ్చినప్పుడు మీకు అలెర్ట్ కూడా వస్తుంది.


Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి