ABP  WhatsApp

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

ABP Desam Updated at: 27 Oct 2021 08:05 PM (IST)
Edited By: Murali Krishna

నరేంద్ర మోదీ 20 ఏళ్ల నాయకత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు.

20 ఏళ్ల మోదీ ప్రజాప్రస్థానంపై అమిత్ షా ప్రశంసలు

NEXT PREV

నరేంద్ర మోదీ నాయకత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. 'డెలివరింగ్ డెమోక్రసీ' అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ 20 ఏళ్ల పాటు ప్రభుత్వాధినేతగా మోదీ చేసిన సేవలు ఎనలేనివన్నారు. 2014 ఎన్నికలకు ముందు చాలా మందికి మోదీ నాయకత్వంపై అనుమానాలు ఉండేవని కానీ ఇప్పుడు నాకంటే ఎక్కువగా ప్రధాని గురించి ప్రజలకే తెలుసన్నారు.







2001లో గుజరాత్ సీఎంగా మోదీకి భాజపా అవకాశం ఇచ్చింది. అప్పటివరకు ఓ ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం మోదీకి లేదు. కానీ మోదీ తనదైన మార్క్ అభివృద్ధి, పారదర్శకతతో పాలన సాగించారు. 2014కు ముందు కాంగ్రెస్ సాగించిన 10 ఏళ్ల పాలనలో కేబినెట్ మంత్రులే ప్రధానమంత్రిగా ఫీలయ్యేవారు. రోజుకో కుంభకోణం వెలుగుచూసింది. ఒకానొక దశలో మన ప్రజాస్వామ్యం కూలిపోతుందేమోనని భయమేసింది. దేశ అంతర్గత భద్రతపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఆ సమయంలో గుజరాత్ సీఎం మోదీని.. ప్రధాని అభ్యర్థిగా భాజపా ప్రకటించింది. 2014 ఎన్నికల ఫలితాలతో దేశంలో పెత్తందారుల పాలన కూలిపోయింది. ఎంతో సహనంతో ప్రజలు మోదీ నాయకత్వం వైపు మొగ్గు చూపారు. పూర్తి మెజారిటీతో దేశాన్ని మోదీ చేతుల్లో పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో అవినీతి రహిత పాలన సాగుతోంది. పాలనలో మోదీ చేసిన మార్పులు ఏంటో మీకే తెలుసు. ఇప్పుడు అంతర్గత భద్రతతో సహా మన దేశ సరిహద్దులు కూడా భద్రంగా ఉన్నాయి. భారత ప్రతిష్ఠ ప్రపంచ నలుమూలలకు విస్తరించింది.                                         - అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి


ఇటీవలే ప్రభుత్వాధినేతగా 20 ఏళ్ల అరుదైన మైలురాయిని నరేంద్ర మోదీ చేరుకున్నారు. 2001లో గుజరాత్ సీఎంగా తొలిసారి ఎన్నికైన ప్రధాని మోదీ.. అనంతరం 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మరింత మెజార్టీతో మరోసారి ప్రధానమంత్రి అయ్యారు.


Also Read: China Land Boundary Law: 'చైనా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే.. సరిహద్దులో హిస్టరీ రిపీట్ అవుద్ది'


Also Read: WHO ON Covaxin: మళ్లీ అదే కథ.. కొవాగ్జిన్‌ అనుమతిపై మారని డబ్ల్యూహెచ్ఓ తీరు!


Also Read: Aryan Khan Drug Case: డ్రగ్స్ కేసులో కీలక సాక్షిని 4 గంటల పాటు ప్రశ్నించిన ఎన్‌సీబీ!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు, 585 మరణాలు నమోదు


Also Read: Amarinder Singh New Party: 'కెప్టెన్' సెకండ్ ఇన్నింగ్స్.. పంజాబ్ ఎన్నికల బరిలో కొత్త పార్టీ!


Also Read: Pegasus Spyware Case: 'పెగాసస్‌'పై సుప్రీం కీలక నిర్ణయం.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 27 Oct 2021 08:05 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.