Festive Sale: ప్రస్తుతం మనదేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఫెస్టివల్ సేల్ జరుగుతోంది. ఇందులో టాబ్లెట్‌లు, ఇతర గాడ్జెట్‌లపై భారీ తగ్గింపులు అందజేస్తున్నారు. మీరు ఈ పండుగ సేల్‌లో టాబ్లెట్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, యాపిల్, షావోమీ, శాంసంగ్ టాబ్లెట్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న ట్యాబ్లెట్ల గురించి తెలుసుకుందాం.
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ ఎం1
ఈ యాపిల్ ఐప్యాడ్‌పై 17 శాతం తగ్గింపు అందిస్తున్నారు. దీన్ని మీరు కేవలం రూ. 49,998కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఎస్‌బీఐ కార్డ్ ద్వారా చెల్లించినట్లయితే, ఈ ట్యాబ్లెట్‌పై అదనంగా రూ. 5000 వరకు తగ్గింపును కూడా పొందుతారు. అంటే రూ.45 వేలకే కొనుగోలు చేయవచ్చన్న మాట.
లెనోవో ట్యాబ్ ఎం10 ఎఫ్‌హెచ్‌డీ ప్లస్
ఈ లెనోవో టాబ్లెట్‌పై మీకు 50 శాతం తగ్గింపు అందిస్తున్నారు. తద్వారా మీరు లెనోవో ట్యాబ్ ఎం10 ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ని కేవలం రూ. 16,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఎస్‌బీఐ కార్డు ద్వారా చెల్లిస్తే, 10 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది.
షావోమీ ప్యాడ్ 6
ఈ షావోమీ ప్యాడ్‌పై మీకు 36 శాతం తగ్గింపును అందిస్తున్నారు. కాబట్టి మీరు దీన్ని కేవలం రూ. 25,998కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఎస్‌బీఐ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపు పొందుతారు.
హానర్ ప్యాడ్ ఎక్స్9
మీరు ఈ హానర్ టాబ్లెట్‌ను 46 శాతం తగ్గింపుతో కేవలం రూ. 13,998తో కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే వినియోగదారులు దానిపై 10 శాతం తగ్గింపును పొందుతారు.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ
మీరు ఈ శాంసంగ్ టాబ్లెట్‌పై 30 శాతం తగ్గింపును పొందుతారు. తద్వారా మీరుశాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ టాబ్లెట్‌ను రూ. 34,999కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఎస్‌బీఐ కార్డు ద్వారా ఈ టాబ్లెట్‌పై 10 శాతం అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8
మీరు ఈ శాంసంగ్ టాబ్లెట్‌ను 34 శాతం తగ్గింపుతో కేవలం రూ. 18,999కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఎస్‌బీఐ కార్డు ద్వారా చెల్లిస్తే, మీరు దానిపై 10 శాతం అదనపు తగ్గింపు పొందుతారు.
మరోవైపు వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్ ఇటీవలే లాంచ్ అయింది. ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కూడా ఉంది. ఇంతకు ముందు వెర్షన్‌తో పోలిస్తే వన్‌ప్లస్ కొత్త ట్యాబ్లెట్‌లో చిన్న సైజు డిస్‌ప్లే, తక్కువ రిజల్యూషన్, పిక్సెల్ డెన్సిటీ, రిఫ్రెష్ రేట్, బ్రైట్‌నెస్ ఉండనున్నాయి. ఇది పోర్టబుల్, తేలికైన ట్యాబ్లెట్. మల్టీ మీడియా, స్ట్రీమింగ్ కోసం ఈ ట్యాబ్‌ను రూపొందించారు. క్వాడ్ డాల్బీ అట్మాస్ స్పీకర్లు కూడా ఈ ట్యాబ్‌లో ఉన్నాయి. ఈ ట్యాబ్‌లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న వైఫై ఓన్లీ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఇదే ర్యామ్, స్టోరేజ్‌లో ఎల్టీఈ ఆప్షన్ ఉన్న వేరియంట్ ధర రూ.21,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ (ఎల్టీఈ) మోడల్‌ను రూ.23,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?