Star Health Data Leak: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కోట్లాది మంది వినియోగదారుల డేటా లీక్ అయింది. వార్తల్లో వినిపిస్తున్న వివరాల ప్రకారం సుమారు 3.1 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లిపోయింది. ఈ డేటా లీక్‌లో మొబైల్ నంబర్లు, పాన్ కార్డ్ వివరాలు, వ్యక్తుల చిరునామాలు, వైద్య పరిస్థితులు వంటి సున్నితమైన సమాచారం ఉంది.
డేటా లీక్‌కి కారణం ఏంటి?
ఈ డేటాను లీక్ చేసిన హ్యాకర్ అయితే కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (CISO) ఈ డేటాను విక్రయించినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత కంపెనీ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం, రెగ్యులేటరీ అధికారులతో కలిసి పని చేస్తోంది.
డేటా లీక్‌లో ఏం ఉంది?
లీకైన సమాచారంలో కస్టమర్ల మొబైల్ నంబర్లు, పాన్ కార్డ్ వివరాలు, చిరునామాలు, వైద్య పరిస్థితులు ఉన్నాయి. హ్యాకర్ ఈ డేటాను టెలిగ్రామ్ చాట్‌బాట్‌ల ద్వారా షేర్ చేసి, తర్వాత వెబ్‌సైట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంచాడు. ‘Starhealthleak.st’ అనే వెబ్ సైట్లో ఈ డేటా ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
హ్యాకర్లు ఏం అంటున్నారు?
ఈ డేటాను అమ్మకానికి అందుబాటులో ఉంచిన తర్వాత హ్యాకర్లు తమ వెబ్‌సైట్‌లో ఇలా రాశారు. "నేను స్టార్ హెల్త్ ఇండియాకు సంబంధించిన కస్టమర్ల డేటాను, బీమా క్లెయిమ్‌లను లీక్ చేస్తున్నాను. ఈ లీకైన డేటాను నాకు స్టార్ హెల్త్, దాని అనుబంధ బీమా కంపెనీలే అందించారు. వారు ఈ డేటాను నేరుగా నాకు విక్రయించారు. కింద ఇచ్చిన టెలిగ్రామ్ బాట్‌లో ఈ లీక్ అయిన డేటాను మీరు చెక్ చేసుకోవచ్చు." అని పేర్కొన్నారు.
కంపెనీ ఏం అంటోంది?
విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత స్టార్ హెల్త్ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో వారు ఈ సంఘటన తమ కార్యకలాపాలను ప్రభావితం చేయలేదని, కానీ దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. కంపెనీ మద్రాస్ హైకోర్టులో కూడా ఈ విషయాన్ని లేవనెత్తింది. లీక్ అయిన సమాచారాన్ని తొలగించాలని కోర్టు ఆదేశించింది.
కస్టమర్లకు సలహా ఇచ్చిన స్టార్
ఈ సంఘటన తర్వాత స్టార్ హెల్త్ తన కస్టమర్‌లకు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, వారి వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని సూచించింది. ఈ విషయంలో తాము పూర్తిగా సహకరిస్తున్నామని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ తెలిపింది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే