చాలా మంది పోగొట్టుకున్న ఫోన్లను వెతికిపట్టుకునేందుకు చాలా కష్టపడుతారు. ఫోన్ లో ఉన్న ముఖ్యమైన సమాచారం కోసం ఎన్నో ఇబ్బందులు పడతారు. పోయిన్ ఫోన్ ను కనిపెట్టాలంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతారు. అయినా, పొయిన ఫోన్ దొరుకుతుందనే గ్యారెంటీ లేదు.


అయితే, ఇకపై ఫోన్ పోయిందని బాధపడాల్సిన పని లేదు. అది ఎక్కడ ఉన్నా ఈజీగా కనిపెట్టే అవకాశం ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ పోర్టల్ సేవలు ఇవాళ్టి(మే 17) నుంచి అందుబాటులోకి రానున్నాయి. సెంటర్ ఫర్ డిపార్ట్‌ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(CDOT)  'సంచార్ సాథీ' అనే వెబ్​ పోర్టల్‌ను రూపొందించింది. ముంబై, ఢిల్లీ, కర్ణాటక సహా కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పటికే ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఇవి దేశ వ్యాప్తంగా విస్తరించాయి.  


'సంచార్ సాథీ' పోర్టల్ ప్రత్యేక ఏంటంటే?


సెల్ ఫోన్ పోగొట్టుకున్న వినియోగదారులు ముందుగా 'సంచార్ సాథీ' పోర్టల్ లో లాగిన్ కావాలి. ముందుగా సంబంధింత అప్లికేషన్ ను పూర్తి చేయాలి. అందులు పొగొట్టుకున్న ఫోన్ నెంబర్ తో పాటు , ఐఎంఈఐ నెంబర్, ఫోన్ వివరాలు, పొగొట్టుకున్న ఏరియా సహా పలు డీటైల్స్ ఇవ్వాలి. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత వినియోగదారుడికి ఓ ఐటీని కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా తమ ఫోన్ స్టేటస్ ను తెలుసుకోవడంతో పాటు ఫోన్ దొరికిన తర్వాత ఐఎంఈఐ నెంబర్ ను అన్ బ్లాక్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించిన తర్వాత  అదే నెంబర్ తో మరో సిమ్ కార్డు తీసుకోని ఉపయోగించుకోవచ్చు. 


ఐఎంఈఐ నెంబర్ ద్వారా నిరంతర నిఘా


'సంచార్ సాథీ' పోర్టల్‌లో అన్ని టెలికాం నెట్‌ వర్క్‌ సంస్థలకు సంబంధించిన ఫోన్ల సమాచారం ఇందులో ఉంటుంది. దీని ద్వారా ఆయా ఫోన్లకు సంబంధించిన వినియోగంపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది.  దేశంలో మొబైల్ ఫోన్లను విక్రయించే ముందు వాటి 15 అంకెల ఐఎంఈఐ నెంబర్ ను కనిపించేలా ఉంచాలని  ప్రభుత్వం ఎప్పుడో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఐఎంఈఐ నెంబర్ల ద్వారా అన్ని మొబైల్ నెట్ వర్క్ ల వివరాలను పొందే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పోగొట్టుకున్న మోబైల్ ఎక్కడైన వినియోగిస్తున్నట్లు తేలితే వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుంది.  టెలికాం ఆపరేటర్లు,   IMEI నంబర్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్‌లో యాక్సెస్‌ కలిగి ఉంటుంది.దీంతో పొయిన ఫోన్ ను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.  


ఇప్పటికే 'సంచార్ సాథీ' పోర్టల్ ద్వారా 4 లక్షల 70 వేలకు పైగా పోగొట్టుకున్న మోబైల్ ఫోన్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్రకటించింది. రెండున్నల లక్షల ఫోన్లను ట్రాక్ చేశారు. 8 వేల ఫోన్లను రికవరీ చేశారు. ఇవాళ్టి నుంచే దేశ వ్యాప్తంగా ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పోగొట్టుకున్న ఫోన్లను బ్లాక్ చేయడంతో పాటు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.  అంతేకాదు, మోబైల్ ఫోన్ల ద్వారా జరిగే నేరాలను ఈ పోర్టల్ ద్వారా నియంత్రించే అవకాశం ఉంది.


Read Also: వాట్సాప్ సరికొత్త ఫీచర్ - ఇకపై మీ చాట్‌ను ఎవరికీ కనిపించకుండా లాక్ చేసుకోవచ్చు!